కోహ్లీ.. సాధారణ ప్లేయర్లా ఫీల్ అవ్వు : షోయబ్ అక్తర్
ఇలా గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ సరైన ఫామ్ లో లేకపోవడం తో అభిమానులు నిరాశ చెందుతున్నారు. మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ పై కాస్త పెదవి విరుస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయంపై పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్ సైతం స్పందించాడు. ప్రస్తుతం బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ తన ఆట తీరును మార్చుకోవాలి అంటు సలహా ఇచ్చాడు షోయబ్ అక్తర్. విరాట్ కోహ్లీ తొలి రెండు మ్యాచ్ లలో 40 ప్లస్ స్కోర్ చేశాడు ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ లలో తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు.
ఈ క్రమంలోనే స్పందించిన షోయబ్ అక్తర్ బాగా ఆడకపోతే విరాట్ కోహ్లీ అయినా సరే జట్టు నుంచి తప్పుకోవాల్సిందే.. ఎందుకంటే ఆ జట్టులో యువ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అందుకే రాణించని రోజున అతని డ్రాప్ చేసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కోహ్లీ బుర్రలో నాకు తెలిసి ఒక పది వేల పరుగుల ఆలోచనలు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అతను మంచి వ్యక్తి అంతకు మించిన గొప్ప క్రికెటర్. కానీ ఈ మధ్య సరిగా పోకస్ చేయడం లేదు. ఇక ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ సైతం బాగా ఆడటం లేదని కోహ్లీ వైపు వేలెత్తి చూపుతున్నారు అంటే అతను ప్రమాదంలో ఉన్నట్లే. కోహ్లీ అన్నీ విషయాలను పక్కన పెట్టి ఒక సాధారణ ప్లేయర్ లాగా ఫీల్ అవు బ్యాటింగ్ లో పరుగులు చేసి చూపించు.. మళ్లీ ఫామ్ లోకి వస్తే అతన్ని ఆపడం ఎవరి తరం కాదు అంటూ చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్.