అతనితో సంభాషణ ఒక అభ్యాసం : విరాట్ కోహ్లీ

praveen
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఇటీవలే గుండెపోటు కారణంగా మృతి చెందడంతో  క్రికెట్ ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి  లో మునిగిపోయింది అన్న విషయం తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్ లో తిరుగులేని స్పిన్నర్ గా వస్తానాన్ని కొనసాగించిన షేర్ వార్న్ ప్రపంచ క్రికెట్లో ఎన్నో అరుదైన రికార్డులు కూడా సాధించాడు.  అంతేకాదు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్గా మరి ఎన్నో రోజుల పాటు జట్టును నడిపించి అద్భుతమైన విజయాలు కూడా అందించాడు. మరీ ముఖ్యంగా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ మధ్య ఆధిపత్య పోరు ఎప్పుడు అభిమానులకు ఆకర్షిస్తూనే ఉండేది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇలా ప్రపంచ క్రికెట్లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న షేన్ వార్న్ అనూహ్యంగా అకస్మాత్తుగా అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఇక ఆ తర్వాత షేర్న్ మృతిపై అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ విచారణలో ఆయన గుండెపోటు ద్వారానే మరణించాడు అన్న విషయం తెల్సింది. దిగ్గజ క్రికెటర్ మృతిపై ఎంతో మంది క్రికెటర్ల స్పందిస్తూ ఇక షేన్వార్న్ తో ఉన్న తమ అనుబంధాన్ని పంచుకున్నారు. ఇటీవల షేన్వార్న్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. షేన్ వార్న్ తో ప్రతి సంభాషణ ఒక అభ్యాసం గా ఉంటుంది విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.



 కొన్నిసార్లు షేన్ వార్న్  ను  కాపీ కాఫీ కొట్టేందుకు కూడా ప్రయత్నించాను  అంటూ తెలిపారు. క్రికెట్ పరంగా నాకు అతని ప్రభావం ఎంతగానో ఉంటుంది అంటూ విరాట్ కోహ్లీ తెలిపాడు. అతను ఒక అద్భుతమైన మానవతావాది అంటూ తెలిపిన విరాట్ కోహ్లీ మైదానం బయట కూడా షేన్ వార్న్  మాట్లాడే అవకాశం లభించింది అంటూ చెప్పుకొచ్చాడు. అతను ఒక సానుకూల వ్యక్తి అతని ఆలోచనలు ఎప్పుడూ నిర్మాణాత్మకంగా ఉంటాయి. ఆయన మాటల నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు.  టెస్టులు ఆట గురించి అతను ఎంతో ఇష్టంగా మాట్లాడుతాడు. క్రికెట్ అంటే షేన్ వార్న్ ప్రేమ.  బహుశా నేను కలుసుకున్న వ్యక్తుల్లో అత్యంత ఆత్మ విశ్వాసం కలిగిన ఆటగాడు అతడు కావచ్చు అంటు విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: