టి20 ఫార్మాట్లో..10 వేల పరుగులు సాధించింది.. ఈ ఏడుగురే?

frame టి20 ఫార్మాట్లో..10 వేల పరుగులు సాధించింది.. ఈ ఏడుగురే?

praveen
సాధారణంగా క్రికెట్ లో మూడు ఫార్మాట్లు ఉంటాయి. కానీ ప్రేక్షకులు అందరికి ఇష్టమైనది టి20 ఫార్మాట్ మాత్రమే. ఎందుకంటే నిమిషాల వ్యవధిలో ఒక జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో తెలిసి పోతుంది. గంటల వ్యవధిలో మ్యాచ్ ఫలితం ఏమిటి అన్నదితేలి పోతుంది. అంతేకాదు ఇక టి20 ఫార్మాట్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిపోతున్న ఉంటుంది. ఇక మ్యాచ్ లో ఎప్పుడు ఎలాంటి అద్భుతం జరుగుతుంది అన్నది కూడా ప్రేక్షకుల ఊహకందని విధంగానే ఉంటుంది. ఇక ఇలాంటి ఉత్కంఠ అటు క్రికెట్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అందుకే పొట్టి ఫార్మాట్ గా పిలుచుకునే టీ20 ఫార్మాట్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు క్రికెట్ ప్రేక్షకులు.


 ఇక మరోవైపు అటు ప్లేయర్స్ కూడా టీ-20 ఫార్మెట్ ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఆటగాడి ప్రతిభకు టీ20 ఫార్మాట్ ఊహించని సవాళ్ళు విసురుతూ ఉంటుంది.  బౌలర్ కు ప్రతి బంతికి వికెట్ తీయాలి అనే లక్ష్యం ఉంటుంది. బ్యాట్స్మెన్ కి ప్రతి బంతిని సిక్సర్ గా మలచాలి అనే టార్గెట్ వుంటుంది. ఇలా t20 ఫార్మాట్లో బంతి కి బ్యాట్ కి మధ్య హోరాహోరీ  యుద్ధం జరుగుతూ ఉంటుంది  అయితే ఇక క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా సిక్సర్లు ఫోర్ల తో రెచ్చిపోతుంటారు. ఎప్పుడూ భారీ పరుగులు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వరకు టి20 ఫార్మాట్లో అరుదైన రికార్డులు సాధించిన ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు.  కానీ పది వేలకుపైగా పరుగులు సాధించిన ప్లేయర్స్ మాత్రం కొంత మంది ఉన్నారు అని చెప్పాలి.


 ఇక ఇలా టీ-20 ఫార్మెట్లో 10000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్స్ లో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ టాప్ లో కొనసాగుతున్నాడూ. ఇప్పటివరకు టి-20 ఫార్మెట్లోనూ 14522 పరుగులు చేశాడు. ఇక షోయబ్ మాలిక్ 11,698 పరుగులతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. కిరణ్ పోలార్డ్ 11474 పరుగులతో మూడవ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆరోన్ ఫించ్ 10409 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 10 వేల మూడు వందల 79 పరుగులతో ఐదవ స్థానంలో, డేవిడ్ వార్నర్ పదివేల 373 పరుగులతో ఆరవ స్థానంలో, రోహిత్ శర్మ 10003 పరుగులతో ఏడవ స్థానంలో కొనసాగుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: