చెన్నై ఓపెనర్ "రుతురాజ్ గైక్వాడ్" వైఫల్యానికి ప్రధాన కారణాలివే?
అయితే రుతురాజ్ గైక్వాడ్ ఎందుకిలా ఫెయిల్ అవుతున్నాడు అన్నది అందరి మదిలో మెదులుతున్న సమస్య. మరి దానికి గల కొన్ని కారణాలను ఇక్కడ చూద్దాం.
* గత ఐపిఎల్ లో కానీ అంతకు ముందు ఐపిఎల్ లో కానీ గైక్వాడ్ చాలా స్వేచ్చగా తన ఆటను ఆడాడు. అయితే అప్పటికి తనపై పెద్దగా అంచనాలు లేకపోవడంతో తనదైన క్లాస్ ఆటతో అందరినీ మెప్పించగలిగే ఇన్నింగ్స్ ను ఆడి జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. అయితే ప్రస్తుతం అతనిపై అంచనాలు పెరిగిపోయాయి, తన నుండి భారీ స్కోరు ను ఆశిస్తున్నారు. అందుకే అతను స్వేచ్చగా ఆడలేక ఫెయిల్ అవుతున్నాడు.
* ఇక మరొక కారణం... ఒత్తిడికి గురి కావడం, ఒక మ్యాచ్ లో విఫలం అయిన తర్వాత ఆటోమేటిక్ గా నెక్స్ట్ మ్యాచ్ లో ఎంతో కొంత ఒత్తిడి ఉండడం సహజమే. అయితే అదే ఒత్తిడి గైక్వాడ్ విషయంలో ఉంది. ఎందుకంటే తాను ఓపెనర్ కావడం వలన జట్టుకు మొదటి 6 ఓవర్ లలో మంచి స్కోర్ సాధించి పెడితే అది విజయానికి ఒక గట్టి పునాది అవుతుంది. ఆ మార్గంలో ఒత్తిడికి లోనై వికెట్ ను పోగొట్టుకుంటున్నాడు.
అయితే మళ్లీ గైక్వాడ్ ఫామ్ లోకి రావాలంటే కేవలం రెండు పనులు చేయాల్సి ఉంది.
ఓపెనర్ గా దిగిన గైక్వాడ్ మొదటి ఆరు ఓవర్లు స్ట్రైకింగ్ అవతలి బ్యాట్స్మన్ కు ఇవ్వాలి. అయితే ఇదే సందర్భంలో డాట్ బాల్స్ ఎక్కువ ఉండకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే తనపై నమ్మకం వచ్చి మిగిలిన ఓవర్ లలో పరుగులు చేయగలడు. లేదంటే తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు వస్తున్నట్లుగా ఓపెనర్ గా కాకుండా, వన్ డౌన్ లో రావడానికి చూడాలి. అపుడు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మరి చూద్దాం ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఫాలో అయ్యి తన మునుపటి ఫామ్ ని అందుకుంటాడో?