హమ్మయ్య.. సన్రైజర్స్ గెలిచింది.. 6.5 కోట్లకు అతను న్యాయం చేశాడు?
ఇలాంటి సమయంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడింది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ సన్ రైజర్స్ గెలవడం అనేది కేవలం కల మాత్రమే అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో సన్రైజర్స్ విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ సీజన్ లో మొదటి మ్యాచ్లో విజయం సాధించిన భోణి కొట్టింది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ విజయంలో అభిషేక్ శర్మ కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. కాగా అతని 6.5 కోట్లు పెట్టి సన్రైజర్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. దీంతో 6.5 కోట్ల కి న్యాయం చేసాడు అంటూ అందరూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
ఏకంగా 50 బంతుల్లో 75 పరుగులు చేసి రాణించాడు అభిషేక్ శర్మ. ఆ తర్వాత విలియమ్సన్ 40 బంతుల్లో 32 పరుగులతో అభిషేక్ శర్మ కు మంచి సహకారం అందించాడు. ఇక ఆఖరి లో వచ్చిన రాహుల్ త్రిపాఠి 15 బంతుల్లో 39 పరుగులు చేసి చెలరేగిపోయాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో వరుసగా నాలుగో ఓటమి చవి చూస్తే అటు సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రం రెండు మ్యాచ్ల ఓటమి తర్వాత మొదటి విజయాన్ని నమోదు చేసింది.. దీంతో అటు తెలుగు అభిమానులు అందరూ కూడా ప్రస్తుతం ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి..