ముంబై ఓడింది.. కానీ అతను రికార్డు సాధించాడు?

praveen
ముంబై ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఈ జట్టు పేరు చెబితే చాలు మిగతా జట్లు అన్ని వణికిపోయేవి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఐపీఎల్లో అంతా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించాయ్. ప్రతి సీజన్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఎప్పుడూ పాయింట్ల పట్టికలో టాప్లో నిలుస్తూ ఉండేవి. అంతేకాదు అతివేగంగా ఇప్పటివరకు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టు గా కూడా కొనసాగుతోంది ముంబై ఇండియన్స్. ఇప్పటి వరకు ఏ జట్టుకు కూడా ఐదు సార్లు టైటిల్ గెలిచిన రికార్డు సాధ్యం కాలేదు అని చెప్పాలి. ఇలా ఐపీఎల్ హిస్టరీ లోనే ఛాంపియన్ జట్టుగా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్.


 అలాంటి ముంబై ఇండియన్స్ కి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే మెగా వేలం కారణంగా ముంబై ఇండియన్స్ జట్టులో కి కొత్త ఆటగాళ్లు వచ్చారు. కొత్త ఆటగాళ్ల రాకతో ఇక ప్రస్తుతం అటు జట్టులో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. గత ఏడాది సీజన్ వరకు ఎంతో పటిష్టంగా కనిపించిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఏడాది మాత్రం ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేకపోతోంది. మరీ ముఖ్యంగా అటు ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జట్ల చేతిలో కూడా ఓడిపోతూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తో జరిగిన మ్యాచ్ లో కూడా ముంబై ఇండియన్స్ ఓటమి చవిచూసింది.



 ఇకపోతే ముంబై అభిమానులు అందరూ కూడా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇక ముంబైకి ఇది నాలుగవ ఓటమి అన్న విషయం తెలిసిందే. అయితే ముంబై ఇండియన్స్ ఓటమి చవి చూసినప్పటికీ అటు ముంబై ఇండియన్స్ ఆటగాడు జూనియర్ ఎబి డివిలియర్స్ గా పేరు తెచ్చుకున్న యువ క్రికెటర్ డెవల్డ్ బ్రెవిస్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసిన ఆటగాడిగా జూనియర్ ఎబి డివిలియర్స్ చరిత్ర సృష్టించాడు. బెంగుళూరు  ఇన్నింగ్స్ 19వ ఓవర్లో తొలి బంతికే  కోహ్లీని ఎల్బిడబ్ల్యు ఔట్ చేశాడు. ఇక ఆ తర్వాత రెండు బంతులకి మాక్స్వెల్ 2 ఫోర్లు కొట్టి జట్టును విజయాన్ని అందించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: