తెలుగు క్రికెటర్ బ్యాటింగ్ పై.. రవిశాస్త్రి కామెంట్స్ వైరల్?

praveen
ఇటీవల జరిగిన మెగా వేలంలో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ అవకాశం దక్కించుకున్నాడు అన్న విషయం తెలిసినదే. కాగా 1.7 కోట్లు వెచ్చించి ఈ యువ ఆటగాడిని ఐపీఎల్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే ఇక తిలక్ వర్మ పై ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతున్న యువ ఆటగాడు తిలక్ వర్మ ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అంతేకాదు అతను చూడటానికి భారీ సిక్సర్లు ఆడగలడు అన్నట్లుగా అస్సలు కనిపించడూ. కానీ ఎంతో అలవోకగా భారీ సిక్సర్లు ఫోర్లు కొడుతూ ప్రస్తుతం అందరి చూపులను తనవైపు తిప్పుకుంటున్నాడు


 పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి ఇక తిలక్ వర్మ ఆటతీరు బాగా సరిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ముంబై ఇండియన్స్ తరుపున ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో కూడా తిలక్ వర్మ మంచి ప్రదర్శన కనబరిచాడు అని చెప్పాలి. అతని ప్రతిభకు ఎంతో మంది మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవలే టీమిండియా మాజీ కోచ్ ప్రస్తుత కామెంటేటర్ రవిశాస్త్రి తిలక్ వర్మ ఇన్నింగ్స్ పై స్పందించాడు. ఈ క్రమంలోనే అతని బ్యాటింగ్ అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపించాడూ.



 తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ రెండు ఇన్నింగ్స్ లు ఎంతో బాగున్నాయని  రవి శాస్త్రి తెలిపాడు. ఇక ఫ్రంట్ ఫుట్ బ్యాక్ ఫుట్ స్వీప్ ఇలా అన్ని రకాల షాట్లు కూడా ఎంతో సునాయాసంగా ఆడ గలుగుతున్నాడు అంటూ రవిశాస్త్రి తెలిపాడు. అంతేకాదు తిలక్ వర్మ షాట్ సెలక్షన్ చేసుకునే విధానం కూడా బాగుంది. ఇక అతని బాడీ లాంగ్వేజ్ కూడా నాకు బాగా నచ్చేసింది. ప్రతి షాట్ కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఆడుతూ ఉన్నాడూ. తిలక్ వర్మ  బాగా రాణించడం అటు ముంబై ఇండియన్స్ కి పెద్ద ప్లస్ పాయింట్ గా మారిపోయింది అంటూ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: