భారత క్రికెటర్లకు ఘోర అవమానం.. ఐసీసీ ఏం చేసిందంటే?
ఇకపోతే 2022 ప్రపంచకప్ లో అటు ఆస్ట్రేలియా ఏడవసారి విశ్వవిజేతగా నిలిచింది అనే విషయం తెలిసిందే. అయితే మహిళల ప్రపంచ కప్ ముగియడంతో అత్యుత్తమ జట్టును ఐసీసీ ప్రకటించింది. ఈ క్రమంలోనే భారత మహిళా క్రికెటర్ లకు ఘోరమైన అవమానం జరిగింది అని తెలుస్తుంది. ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ జట్టులో ఒక్క భారత క్రికెటర్ కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. ఇటీవలే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన అఫ్ స్టాక్ మోస్ట్ వాల్యూబుల్ జట్టుకు ఆస్ట్రేలియాకు చెందిన మేగ్ లానింగ్ కెప్టెన్గా ఎంపిక కాగా నలుగురు ఆసిస్ క్రికెటర్లకు చోటు దక్కింది. కాక ఈ మెగా టోర్నీలో లానింగ్ 394 పరుగులు చేసింది. ఆమెతోపాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన అలిస్సా హీలీ సహా మరో ఇద్దరికీ చోటు దక్కడం గమనార్హం.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన ఐసీసీ మోస్ట్ వాల్యూబుల్ జట్టు వివరాలు ఇలా ఉన్నాయి... అలిస్సా హీలీ (వికెట్ కీపర్) (ఆస్ట్రేలియా) మెగ్ లానింగ్ (కెప్టెన్) (ఆస్ట్రేలియా), రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా), నాట్ స్కివర్ (ఇంగ్లండ్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్) చార్లీ డీన్ (ఇంగ్లండ్). ఇందులో ఒకరికీ కూడా భారత మహిళా క్రికెటర్లకు చోటు దక్కకపోవడంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.