ఇప్పటికీ సొంత ఇల్లు లేదు :: తిలక్ వర్మ

praveen
భారత క్రికెట్ లో ఎక్కడ చూసినా యువ ఆటగాడు తిలక్ వర్మ గురించి చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తిలక్ వర్మ గురించి ఏదో ఒక వార్త వైరల్ గా మారిపోతుంది. ఇటీవలే ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఈ యువ ఆటగాడు అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు అని చెప్పాలి. దీంతో అటు తెలుగు ప్రజలందరూ కూడా ఎంతగానో సంబరపడిపోతున్నారు. తెలుగు వాడు ఎక్కడ ఉన్నారు అన్నది కాదు  బాగా రాణించారా లేదా అన్నది ముఖ్యం అంటూ అతనికి పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తూ ఉండడం గమనార్హం.



 కాగా ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరిగిన మెగా వేలం సమయంలో ఐపీఎల్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ 1.7 కోట్లు పెట్టి తిలక్ వర్మ ని తమ జట్టులో చేర్చుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ముంబై ఇండియన్స్ అతనిపై ఉంచిన నమ్మకాన్ని ఇటీవల జరిగిన ఇన్నింగ్స్ తో నిలబెట్టుకున్నాడు తిలక్ వర్మ అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని ప్రతిభపై ఎంతో మంది ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు.ఇలాంటి నేపథ్యంలోనే తిలక్ వర్మ గతంలో చెప్పిన కొన్ని విషయాలు వైరల్ గా మారిపోతున్నాయి. మాకు ఇప్పటికి కూడా సొంత ఇల్లు లేదు అద్దె ఇంట్లోనే ఉంటున్నాం అంటూ తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.


 సొంత ఇల్లు ఉండడం మా తల్లిదండ్రుల కల ఐపీఎల్ లో వచ్చిన డబ్బుతో కొత్త ఇల్లు కొని వారికి బహుమతిగా ఇస్తాను. అయితే ఐపీఎల్ లో వచ్చిన డబ్బులు విలాసవంతమైన జీవితాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ఇక ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బులతో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎంతో స్వేచ్ఛగా కెరీర్లో రాణించేందుకు అవకాశం కూడా ఉంటుంది అంటూ తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవలే ముంబై ఇండియన్స్ తరఫున ఏకంగా 33 బంతుల్లో 61 పరుగులు చేసిన తిలక్ వర్మ ఇక ముంబై ఇండియన్స్ తరఫున అతి చిన్న వయసులో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: