ముంబై ఇండియన్స్ కి.. అతను భారంగా మారుతున్నాడా?
ఇక జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతి సారి కూడా కిరణ్ పోలార్డ్ అద్భుతంగా రాణిస్తాడూ అని ముంబై ఇండియన్స్ అభిమానులందరూ భారీగానే ఆశలు పెట్టుకుంటారు. కానీ గత కొంత కాలం నుంచి కిరణ్ పోలార్డ్ పేలవమైన ప్రదర్శనతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. కొన్నాళ్లుగా కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ లో ఎలాంటి విధ్వంసం కనిపించడం లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి దేశవాలి లీక్స్ వరకు కూడా ఎక్కడ ఆకట్టుకోలేక పోతున్నాడు. ఇక ఇటీవలే ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో భాగంగా రెండు మ్యాచ్ లు ఆడిన రెండు మ్యాచ్లలో కూడా సరైన ప్రదర్శన చేయలేకపోయాడు.
రెండు మ్యాచ్ లలో కిరణ్ పోలార్డ్ చేసింది కేవలం 14 పరుగులు మాత్రమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఇక మొన్నటివరకు స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగిన కీరన్ పొలార్డ్ కాస్త ఇప్పుడు జట్టుకు భారంగా మారిపోతున్నాడా అనే సందేహాలు వస్తున్నాయి. గతంలో కూడా పద్నాలుగు మ్యాచ్ లలో కేవలం 245 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ లో కేవలం ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అతని ఆట తీరు పై నమ్మకంతో మెగా వేలంకు ముందు అతని రిటైన్ చేసుకుంది ముంబై ఇండియన్స్. అతను మాత్రం జట్టు యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోతున్నాడూ అన్నది తెలుస్తుంది.