నేను క్రికెట్ ఆడాను.. ఇదే సాక్ష్యం.. గట్టిగా ఇచ్చేసాడుగా?
కొన్ని కొన్ని సార్లు ఇలాంటి చేదు అనుభవం ఎదురైనా సమయంలో దీటుగానే బదులు ఇస్తూ ఉంటారు క్రికెటర్లు. ఇక ఇటీవల టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ కుమార్ కుమారుడు రోహన్ గావస్కర్ కూడా తన గురించి వ్యంగంగా మాట్లాడిన నేటిజన్ కు గట్టిగానే బదులిచ్చాడు. ఇక ఒక ఫోటోతో ఏకంగా అతడి నోరు మూయించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే భారత వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా కామెంటేటర్ గా కొనసాగుతున్న రోహన్ గవర్కర్.
ఇక రోహన్ గావస్కర్ ను ఉద్దేశించి ఒక నెటిజన్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టాడు. రోహన్ గావస్కర్ ఇప్పుడు 2022 సీజన్ టీ20 లీగ్ లో వ్యాఖ్యాతగా ఉన్నాడు. ఇంతకీ అతను ఎప్పుడూ క్రికెట్ ఆడాడు ఎప్పుడు రిటైర్ అయ్యాడు. నేనేమైనా క్రికెట్ మ్యాచ్ ను చూడలేకపోతున్నానా అంటూ కాస్త వ్యంగ్యంగా పోస్టు పెట్టాడు నేటిజన్. ఇది చూసిన రోహన్ గావస్కర్ తనదైన శైలిలో స్పందించారు. క్రికెట్ ఆడుతున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దానికి జవాబు ఇచ్చాడు. నేను క్రికెట్ ఆడాను అని చెప్పడానికి ఇదే సాక్ష్యం అంటూ సమాధానం చెప్పాడు. ఇండియా నుండి తరఫున 11 వన్డే మ్యాచులు ఆడిన రోహన్ గావస్కర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మాత్రమే 117 మ్యాచ్లు ఆడి 6938 పరుగులు చేశాడు.