ఓటమి బాధలో ఉన్న చెన్నైకి.. సూపర్ గుడ్ న్యూస్?

praveen
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్ ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టుగా కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతిసారీ కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంద చెన్నై సూపర్ కింగ్స్.  అయితే ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ ఐదవసారి టైటిల్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. మెగా వేలం కారణంగా జట్టు లో ఎన్నో అనూహ్యమైన మార్పులు జరుగ అటు మహేంద్ర సింగ్ ధోనీ సైతం తన కెప్టెన్సీ నుంచి తప్పుకుని ఇక సారథ్య బాధ్యతలను సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కు అప్పగించాడు.


 ఇకపోతే మార్చి 26వ తేదీన ఐపీఎల్  ప్రారంభం కాగా ఈ ప్రారంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ గత ఏడాది రన్నరప్ గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చవిచూసింది. కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. దీంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఇలా ఓటమి బాధ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆటగాళ్లు అందరికీ కూడా ఊరట కలిగించే  ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.


 క్వారంటైన్ నిబంధనల కారణంగా కోల్కత్తా తో జరిగిన మ్యాచ్ కి దూరంగా ఉన్న స్టార్ ఆల్రౌండర్ మోయిన్ అలీ. ఇక ఇటీవల చెన్నై జట్టుతో చేరిపోయాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే జట్టు క్యాంపు లోకి వచ్చిన మోయిన్ అలీ సభ్యులందరినీ పలకరిస్తూ ఆలింగనం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇకపోతే మొయిన్ అలీ రాకతో అటు చెన్నై సూపర్ కింగ్స్ మరింత పటిష్టంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ రెండో మ్యాచ్ మార్చి 31వ తేదీన ఆడ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: