కోహ్లీ అడిగితే ఉండేవాడిని.. చాహల్ షాకింగ్ కామెంట్స్?
అయితే ఇక మెగా వేలంలో చాహల్ ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మళ్లీ కొనుగోలు చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇక అతని కోసం బెంగళూరు జట్టు ఆసక్తి చూపించకపోవడం తో చివరికి రాజస్థాన్ జట్టు అతని సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే 2010లో రాజస్థాన్ జట్టులో కొనసాగాడు చాహల్. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే జట్టులోకి వెళ్ళాడు అన్న విషయం తెలిసిందే. అయితే బెంగళూరు జట్టు నుంచి తప్పుకోవడంతో ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు చాహల్.
జట్టుతో కొనసామని బెంగళూరు మేనేజ్మెంట్ బృందం లేదా కోహ్లీ అడిగి ఉంటే ఖచ్చితంగా ఒప్పుకునే వాడిని అంటూ చాహల్ చెప్పుకొచ్చాడు. నా మొదటి కుటుంబంతో తిరిగి కలవడం సంతోషంగా ఉంది అంటూ తెలిపాడు. రాజస్థాన్ తరపున ఆడేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్న అంటూ చెప్పుకొచ్చాడు. బెంగళూరు జట్టుతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఇక ఆ జట్టు తో బావోద్వేగ పూరితమైన బంధం ఏర్పరచుకొన్నా.. బెంగళూరుకి కాకుండా మరో జట్టు ఆడుతాను అని ఎన్నడూ కూడా ఊహించలేదు. అయితే ఎక్కువ డబ్బు డిమాండ్ చేసి ఆ జట్టు నుంచి వెళ్లిపోయానని సామాజిక మాధ్యమలలో అంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. బెంగుళూరు యాజమాన్యం నాకు ఫోన్ చేసి కేవలం ముగ్గురిని మాత్రమే అంటిపెట్టుకున్నామని చెప్పారు. మెగా వేలంలో కొనుగోలు చేస్తామన్నారు. కానీ ఇక ఆ తర్వాత అది కుదరలేదు. డబ్బు ప్రాధాన్యత కాదు బెంగళూరు నాకు ఎంతో ఇచ్చింది. ఇప్పుడు వేరే జట్టులో ఆడబోతున్నంత మాత్రాన బౌలింగ్ మారదు.. జెర్సీ మాత్రమే మారుతుంది అంటూ చెప్పుకొచ్చాడు..