ఐపీఎల్ 15: కోల్కత్తా జట్టు రికార్డు తిరగరాస్తుందా... ?
కోల్కతా ఎన్నో ఆశలతో శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ గా ఎంచుకుంది. ఇక చెన్నై కి కెప్టెన్ గా ఉన్న ఎమ్మెస్ ధోనీ రెండు రోజుల క్రితం కెప్టెన్సీ నుండి శాశ్వతంగా తొలగిపోవడంతో జడేజాకు ఆ అవకాశం దక్కింది. ఇదిలా ఉంటే ఈ రోజు మ్యాచ్ జరగబోయే స్టేడియం గతంలో ఆడిన మ్యాచ్ లను బట్టి చూస్తే చెన్నైకు అనుకూలంగా ఉంది. ఈ స్టేడియం లో గత సీజన్ లో చెన్నై 5 మ్యాచ్ లు ఆడితే, వాటిలో 4 మ్యాచ్ లలో గెలిచి మంచి రికార్డును కలిగి ఉంది. అదే విధముగా కోల్కతా టీమ్ కు ఇక్కడ ఉన్న రికార్డును పరిశీలిస్తే, కేకేఆర్ ఇక్కడ మొత్తం 11 మ్యాచ్ లు ఆడగా 10 మ్యాచ్ లలో ఓటమి పాలయింది. దీనితో ఒత్తిడి మొత్తం కోల్కతా మీదనే ఉండనుంది.
కానీ కొత్త కెప్టెన్ తో ఫ్రెష్ గా ఆడి చెన్నై కు షాక్ ఇస్తుందా? లేదా ఈ గ్రౌండ్ లో ఉన్న చెత్త రికార్డును కొనసాగిస్తుందా అన్నది తెలియాలంటే ఇంకాస్తసేపు ఆగాల్సిందే. అయితే ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడానికి మొగ్గు చూపుతుంది అని తెలుస్తోంది. మరి ఏమి జరగనుంది అనేది తెలియాల్సి ఉంది.