ఆయనను ఎప్పుడు కలిసిన ఎంతో స్పెషల్ : పంత్

praveen
ధోని వారసుడిగా ఇండియన్ క్రికెట్ లోకి అడుగు పెట్టిన రిషబ్ పంత్ తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక మొదట్లో కీపింగ్ విషయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ బ్యాటింగ్లో మాత్రం అదరగొట్టాడు. ఇటీవలి కాలంలో బ్యాటింగ్ తోపాటు కీపింగ్ లో కూడా ఎంతో అనుభవం సాధించే బాగా రాణిస్తున్నాడు. అయితే ఇక భారత జట్టులో కీలక ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కు ముందుగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించాడు. కానీ శ్రేయస్ అయ్యర్ ఇక గాయం కారణంగా ఐపీఎల్కు దూరం కావడంతో ఇకకొత్త కెప్టెన్గా రిషబ్ పంత్ ను నియమించింది జట్టు యాజమాన్యం.

 ఇక ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకునీ జట్టులోకి వచ్చినప్పటికీ ఇక రిషబ్ పంత్ నే కెప్టెన్గా కొనసాగించింది అన్న విషయం తెలిసిందే. ఇక రిషబ్ పంత్ ఎలాంటి అనుభవం లేక పోయినప్పటికీ కెప్టెన్సీలో ఎలాంటి తడబాటు లేకుండా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. రిషబ్ పంత్ కెప్టెన్సీలో హెడ్ కోచ్ గా ఉన్న రికీ పాంటింగ్ ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ గా కొనసాగుతున్న రికీ పాంటింగ్ గురించి ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పంత్.

 తమ కోచ్ రికి పాంటింగ్ను  ఎప్పుడు కలిసినా కూడా ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. సొంత కుటుంబ సభ్యులను కలిసాము అన్న భావన కలుగుతుంది అంటూ తెలిపాడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్. మైదానంలో ఆటగాళ్లు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా రికీ పాంటింగ్ ప్రోత్సహిస్తారని వ్యాఖ్యానించాడు రిషబ్ పంత్. ఇక ఈ సారి జట్టులో  ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయని.. ఇక జట్టు ఆటగాళ్లు అందరూ కూడా సానుకూల దృక్పథంతోనే ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ లో బాగా రాణిస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: