యువ ప్లేయర్ కి బంపర్ ఆఫర్.. ఆ జట్టులో ఛాన్స్?

praveen
ఐపీఎల్ లో చోటు దక్కించుకోవాలని ప్రతి ఒక యువ ఆటగాడు ఆశ పడుతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. అందుకని ఒకసారి ఐపీఎల్ లో అవకాశం వచ్చింది అంటే చాలు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మంచి ఫ్లాట్ ఫామ్ దొరికినట్లు అవుతుంది. ఈ లీగ్ ద్వారా మంచి క్రికెటర్లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం టీమిండియాలో కొనసాగుతున్న సార్లు మొత్తం ఒకప్పుడు ఐపీఎల్లో బాగా రాణించిన వారరే కావడం గమనార్హం. అయితే కొంత మంది ఆటగాళ్లకు ఎంతో సులభంగా అటు ఐపీఎల్లో అవకాశం వస్తు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమందికి మాత్రం నిరీక్షణ తప్పదు.

 కానీ కొంతమంది యువ ఆటగాళ్లకు అనుకోని విధంగా అదృష్టం వరించి ఐపీఎల్ లో ఆడే అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు.  భారత అండర్-19 స్పిన్నర్ కౌశల్ తాంబె కి కూడా ఇలాంటి బంపర్ ఆఫర్ వచ్చింది అని తెలుస్తుంది. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నెట్ బౌలర్గా కౌశల్ తాంబె ఇటీవల ఎంపికయ్యాడు అనేది తెలుస్తుంది.. ఇటీవలే ఐపీఎల్ 2022 మెగా వేలంలో పాల్గొన్నాడు ఈ యువ ఆటగాడు. కానీ ఏ ఫ్రాంచైజీ కూడా అతని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఐపీఎల్ లో ఏ జట్టు కొనుగోలు చేయకపోవడంతో కాస్త నిరాశ చెందాడు అని చెప్పాలి.

 కానీ ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి నెట్ బౌలర్ గా ఎంపికయి ఐపీఎల్ లో భాగమయ్యాడు. అయితే కౌశల్ తాంబే ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించాడు అని చెప్పాలి. ఇకపోతే కౌశల్ తాంబే సహచర ఆటగాళ్లు అయిన యష్ దుల్, విక్కీ లాంటి ఆటగాళ్లను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేయడం గమనార్హం.  డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ లాంటి సీనియర్ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్  షేర్ చేసుకోబోతున్నాడు కౌశల్. ఢిల్లీ కాపిటల్ కోచ్ రిక్కీ పాంటింగ్, షేన్ వాట్సన్  సూచనలతో మరింత మెరుగైన క్రికెటర్గా ఎదిగేందుకు కూడా అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: