ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ.. మీరు చూశారా?

praveen
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. మార్చి 26వ తేదీ నుంచి ఇక ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్లో టైటిల్ గెలవడానికి ప్రతి జట్టు కూడా వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. ఐపీఎల్ లోకి లక్నో గుజరాత్ లాంటి రెండు కొత్తజంట ఇవ్వడంతో ఐపీఎల్ ఫార్మాట్ పూర్తిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. మొత్తంగా ఐపీఎల్ లో తలపడుతున్న 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించింది బీసీసీఐ.


 ఇక ఈ రెండు గ్రూపులలో కూడా  తమ గ్రూపులోని జట్లతో ఎక్కువసార్లు తలపడుతున్నాయి. ఇక ఈ కొత్త ఫార్మాట్ లో ఐపిఎల్ ఎలా ఉండబోతుందో అన్నది అటు ప్రేక్షకుల అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక అంతే కాకుండా మెగా వేలం కారణంగా అన్ని జట్లలోకి కూడా కొత్త ఆటగాళ్లు ఎంట్రీ ఇవ్వడంతో ప్రతి జట్టు తన ప్రస్థానాన్ని ఎలా కొనసాగించబోతుంది అన్నది కూడా ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇక ప్రతి జట్టు కూడా తమ టీం కి సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది.


 ఇకపోతే ఐపీఎల్ చరిత్రలోనే ఐదుసార్లు టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2022  కోసం సిద్ధమైంది.. ఇకపోతే ఇటీవల ముంబై ఇండియన్స్ జట్టు తమ కొత్త జెర్సీ ఆవిష్కరించింది అనేది తెలుస్తుంది. జెర్సీ విడుదలకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ కొత్త జెర్సీ లో పలు మార్పులు జరిగాయి అన్నది తెలుస్తుంది. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతోన్న ముంబై ఇండియన్స్ ఆరోసారి టైటిల్ తెలపడమే లక్ష్యంగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది అని తెలుస్తోంది..Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: