వారెవ్వా జడ్డు భాయ్.. తగ్గేదేలే అన్నాడు.. సెంచరీ కొట్టేసాడు?
క్లిష్ట పరిస్థితుల్లో బ్యాట్ తో విజృంభిస్తూ టీమిండియాకు విజయాన్ని అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి.. ఇకపోతే ఇటీవల గాయం బారిన పడిన రవీంద్ర జడేజా కొన్నాళ్లపాటు క్రికెట్కు దూరం అయిపోయాడు.. ఇంక ఇటీవలే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటూ గాయం నుంచి కోలుకున్నాడు రవీంద్ర జడేజా. ఇక ఇటీవలే శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో జట్టులోకి ఇచ్చాడు. ఇక రావడం రావడమే రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.
టీమిండియాలో ఎవరు సెంచరీ చేస్తారా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఏకంగా 227 బంతుల్లో 174 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక 160 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు రవీంద్ర జడేజా. ఇందులో 10 ఫోర్లు ఉండడం గమనార్హం. రవీంద్ర జడేజా కెరీర్లో ఇది రెండో టెస్టు సెంచరీ కావడం గమనార్హం. రవీంద్ర జడేజాకు మంచి తోడ్పాటు అందించిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 61 పరుగుల వద్ద అవుటయ్యాడు. రవీంద్ర జడేజా అద్భుతమైన ఫామ్లో కొనసాగుతూ అదరగొట్టడంతో అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు... దీంతో ఏడవ స్థానంలో వచ్చిఅత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డ్ కపిల్ దేవ్ పేరిట ఉండేది. కపిల్ దేవ్ 166 పరుగులతో ఏడవ స్థానంలో వచ్చి ఎక్కువ పరుగులు భారత ఆటగాడిగా ముందు స్థానంలో ఉండేవాడు.