వారెవ్వా.. 37 బంతుల్లో సెంచరీ.. సన్రైజర్స్ బ్యాట్మెన్ అదుర్స్?
కానీ ఇప్పుడు మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగి పోయే ఒక వార్త అందింది. వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్మెన్ నికోలస్ ఫోరం ఇటీవల టి10 బ్లాస్ట్ లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 37 బంతుల్లోనే 10 సిక్సర్లు 6 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు నికోలస్ పూరన్. టి 10 బ్లాస్ట్ లో భాగంగా లెదర్ బాక్ జెంట్స్ స్కార్లెట్ ఛార్జర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లేథెర్ బ్యాక్ జెయింట్స్ జట్టులో కొనసాగుతున్నాడు నికోలస్ పూరన్. ఇక అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టాడు.
8.3 ఓవర్లలోనే ఏకంగా 129 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది ఆ జట్టు. ఇక నికోలస్ పూరన్ వేగంగా 37 బంతుల్లోనే సెంచరీ చేయడంతో ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ కు అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగి పోతున్నారు. ఇక ఇదే ఫామ్ లో కొనసాగితే రానున్న ఐపీఎల్ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయంలో నికోలస్ పూరన్ కీలక పాత్ర వహించే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు అభిమానులు. ఇక పేలవమైన ఫాంలో కొనసాగుతున్న అతన్ని కొనుగోలు చేసి తప్పు చేసింది అనుకున్న వారే సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మంచి నిర్ణయం తీసుకుంది అంటూ చెబుతున్నారు.