వావ్.. కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్?
ఇక విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులను చేదించడం అంటే దాదాపు ఎంతో కష్టం అని చెప్పాలి. అలాంటిది ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతం గా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ మాత్రం కోహ్లీ రికార్డును బద్దలు కొట్టేశాడు. గత కొంత కాలం నుంచి వరుసగా టీమిండియా లో ఛాన్స్ దక్కించుకుంటున్న శ్రేయస్ అయ్యర్ వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా బాగా ఉపయోగించుకుంటున్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతూ భారత జట్టు లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇటీవలే శ్రీలంక తో జరిగిన టి20 సిరీస్లో కూడా ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అన్న విషయం తెలిసిందే.
ఇలా శ్రీలంక తో జరిగిన టెస్టు సిరీస్లో అదర గొట్టిన శ్రేయస్ అయ్యర్.. టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టేశాడు. 2016 లో ఆస్ట్రేలియా జట్టు పై విరాట్ కోహ్లీ ఒక సిరీస్లో 199 పరుగులు చేశాడు. ఇలా ఇప్పటి వరకు ఒక సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఇక ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్లో శ్రేయస్ అయ్యర్ మూడు మ్యాచ్ల్లో కలిపి 204 పరుగులు చేసి విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టేశాడు..