షాకింగ్ : లంక క్రికెటర్ల బస్సులో బుల్లెట్లు కలకలం?
కాగా మొహాలీ స్టేడియం వేదికగా భారత్ శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగబోతోంది.. తొలి టెస్ట్ మ్యాచ్ కి ముందు ఇటీవలే ఒక షాకింగ్ వార్త అందరినీ కలవరపెడుతు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. టి20 జట్టు లో లేని శ్రీలంక ఆటగాళ్లు ప్రయాణించిన వాహనంలో 2 బుల్లెట్ షెల్స్ బయటపడటంతో ఒక్కసారిగా కలకలం రేపింది. లంక క్రికెటర్లు ఓ ప్రైవేటు బస్సులో తాము బస చేస్తున్న లలిత్ హోటల్ నుంచి టెస్ట్ మ్యాచ్ వేదిక అయిన పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం కి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో సాధారణంగా పోలీసులు తనిఖీలు చేశారు. ఇక ఈ తనిఖీల్లో రెండు బుల్లెట్ షెల్స్ కనిపించాయి.
పోలీసులు మెటల్ డిటెక్టర్ తో తనిఖీ చేస్తున్న సమయంలో బస్సు లగేజ్ కంపార్ట్మెంట్లో ఇక ఇలా బుల్లెట్టు ప్రత్యక్షం కావడం మాత్రం ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేసింది. లంగా క్రికెటర్ల కోసం బస్సు అద్దెకు తీసుకోవడానికి ముందు ఒక మ్యారేజ్ ఫంక్షన్ కోసం ఇక ఈ బస్సు వాడినట్లు పోలీస్ విచారణలో తేలింది. ఇక చండీగర్ లోని తార బ్రదర్స్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి బస్సులను అద్దెకు తీసుకున్నట్లు పోలీసు విచారణలో అసలు విషయం బయటకు రావడం గమనార్హం. ఇకపోతే మొహాలీ స్టేడియం వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి 100వ టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం..