పాపం.. టీమిండియాలో చోటు దక్కింది.. కానీ దురదృష్టం?
కానీ రుతురాజ్ ను మాత్రం దురదృష్టం వెంటాడింది. తన కుడిచేతి మణికట్టు గాయం తిరగబెట్టింది. బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కున్నాడు అన్నది తెలుస్తోంది. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నాడట రూతురాజ్. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మిగతా మ్యాచ్ లకు దూరంగా ఉంటాడు అన్నది తెలుస్తుంది. అయితే రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మయాంక్ అగర్వాల్ జట్టులోకి రాబోతున్నాడు. ఇప్పటికే మయాంక్ అగర్వాల్ జట్టుతో జాయిన్ అయ్యాడట. అయితే మయాంక్ అగర్వాల్ టీమిండియాలో ఎంపిక అయినప్పటికీ బయో బబుల్ లో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. అయితే రుతు రాజ్ వెస్టిండీస్ తో ముగిసిన సిరీస్ లో ఆఖరి మ్యాచ్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
అయితే టీమిండియాకు ఇప్పటికే కె.ఎల్.రాహుల్,అక్షర్ పటేల్, దీపక్ చాహర్, సూర్యకుమార్ యాదవ్ లాంటి కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. ఇప్పుడు రుతురాజ్ కూడా గాయం బారినపడి దూరమయ్యాడు. ఇలా వరుసగా ఆటగాళ్లు గాయాల బారినపడి దూరమవ్వడం మాత్రం అటు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ అని చెప్పాలి. తొలి టీ-20 మ్యాచ్లో 62 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఇక నేడు రెండో టి20 మ్యాచ్ ఆడబోతుంది.