మిథాలీ రాజ్ షాకింగ్ నిర్ణయం.. త్వరలో రిటైర్మెంట్?

praveen
భారత క్రికెట్లో కేవలం పురుషులకు మాత్రమే మంచి గుర్తింపు ఉన్న సమయంలో పురుషులకు తాము ఎక్కడ తక్కువ కాదని నిరూపించింది మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్. మహిళా క్రికెట్కు ఎనలేని గౌరవాన్ని గుర్తింపును తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది అనే చెప్పాలి. అంతే కాదు దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్ జట్టుకు సేవలు అందిస్తూ ఇప్పటికీ అత్యుత్తమ ఫామ్ లో కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది మిథాలీ రాజ్. మొన్నటి వరకు అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ కాలం కొనసాగిన రికార్డ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట ఉండేది.



 కానీ ఈ రికార్డులను తిరగరాస్తూ భారత క్రికెట్లో రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన ప్లేయర్గా మిథాలీ రాజ్ తనకంటూ ప్రత్యేకమైన రికార్డును సృష్టించింది. ఇప్పటికీ వన్డే ఫార్మాట్ కెప్టెన్ గా కొనసాగుతున్న మిథాలీ రాజ్ జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తోంది. అంతేకాదు తన సారధ్యంలోనే ఎంతోమంది యువ ప్లేయర్లను కూడా రాటుదేలేలా చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  ఇక ఇప్పటికే  అంతర్జాతీయ క్రికెట్లో ఇరవై సంవత్సరాలకు పైగా సేవలందించిన మిథాలీ రాజ్ రిటైర్మెంట్ గురించి గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతుంది అనే విషయం తెలిసిందే.



 అయితే ఇటీవలే భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న మిథాలీ రాజ్ రిటైర్మెంట్పై  సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెట్ కు వీడ్కోలు పలకగపోతున్నట్లు తెలిపింది. త్వరలో జరగబోయే వన్డే ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాను అంటూ ఇటీవల మిథాలీ రాజ్ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో ఎంతో టాలెంట్ ఉన్న క్రికెటర్లతో జట్టు ఎంతో పటిష్టంగా మారబోతుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది మిథాలీరాజ్.. కాగా మిథాలీ రాజ్ ఇప్పటివరకు 222 వన్డేలు ఆడి 7516 పరుగులు చేసింది. ఇక 12 టెస్టు మ్యాచ్లు ఆడి 699 పరుగులు, 89 టి20 మ్యాచ్ లలో 2324 పరుగులు చేసింది మిథాలీ రాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: