ఐపీఎల్ 2022 : 55 లీగ్ మ్యాచ్ లు అక్కడేనట?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ మెగా వేలం ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అభిమానులందరి అంచనాలు తారుమారయ్యాయి. మెగా వేలంలో ఎంతోమంది అనుభవంగల స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఇక ఈసారి వారికి రికార్డు స్థాయిలో  ధర పలికే అవకాశం ఉందని ఇక ఐపీఎల్ లో ఇప్పటివరకు ఉన్న రికార్డులు అన్ని బద్దలు అయిపోతాయి అని ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు.


 కానీ ఐపీఎల్ మెగా వేలం లో మాత్రం అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా జరిగే ఐపీఎల్ లో స్టార్ ఆటగాళ్లను అన్ని ఫ్రాంచైజీలు పక్కన పెట్టేశాయ్. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న యువ ఆటగాళ్ల పైనే ఎక్కువ దృష్టి పెట్టి కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేయడం గమనార్హం. ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియ ముగిసింది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టిని కూడా ఐపీఎల్ మెగా టోర్ని  ఎప్పుడు ఎక్కడ జరగబోతుంది అనే దానిపైన ఉంది అని చెప్పాలి. అయితే బిసిసీఐ ఇప్పటివరకు ఐపీఎల్ షెడ్యూల్ కు సంబంధించి అధికారిక ప్రకటన చేయలేదు.  కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎన్నో వార్తలు వైరల్ గా మారిపోతున్నాయి.


 ఇకపోతే ఐపీఎల్ 2022  లీగ్ మ్యాచ్ లు అన్నీ కూడా ముంబై, పూణే లలోనే జరగబోతున్నట్లు తెలుస్తోంది. ముంబైలో ఉన్న వాంఖడే స్టేడియం, బ్ర బోర్న్  స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలో మొత్తం 55 లీగ్ మ్యాచ్లు జరగబోతున్నాయట. ఇక అంతే కాకుండా పూణేలోని ఎం సి ఎ ఇంటర్నేషనల్ స్టేడియం లో 15 లీగ్ మ్యాచ్లు నిర్వహించబోతుందట బిసీసీఐ. దీనికి సంబంధించి బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం. ఇక 26వ తేదీన ఐపీఎల్ టోర్నీ మొదలయ్యే అవకాశం ఉందని మే 29వ తేదీన మ్యాచ్ జరగబోతుందని అయితే ప్లే ఆప్స్ మ్యాచ్లు ఎక్కడ నిర్వహించాలనే దానిపై మాత్రం ఇంకా బిసిసిఐ ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: