రిటైర్మెంట్ సమయంలో ధోనికి ఇచ్చిన మాట.. నిలబెట్టుకున్నా?

praveen
ఎన్నో రోజుల నుంచి టీమిండియాకు ఆల్రౌండర్ల కొరత వేధిస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో దీపక్ చాహర్ తన అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. వికెట్ టూ వికెట్ బంతులను విసురుతూ అటు బ్యాట్స్మెన్లను అప్పు తిప్పలు పెడుతుంటాడు దీపక్ చాహర్. టీమిండియాకు అవసరమైనప్పుడల్లా ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ కీలకమైన సమయంలో వికెట్లు పడగొడతాడు. అంతే కాదు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా తన బ్యాటింగ్తో కూడా అదరగొడుతున్నాడు దీపక్ చాహర్. ఇది ఇప్పటి వరకు టీమిండియా తరఫున 7 వన్డేలు ఆడిన దీపక్ చాహర్ 179 పరుగులతో బ్యాటింగ్ లో కూడా రాణించాడు.

 ఇక ఇందులో రెండు అర్థ సెంచరీలు కూడా ఉండటం గమనార్హం. ఇక ఇప్పటి వరకు 7 మ్యాచ్ లలో 10 వికెట్లు తీసిన దీపక్ చాహర్ ఆల్రౌండర్గా మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే తాను బౌలింగ్లో మాత్రమే కాదు బ్యాటింగ్ లో కూడా రాణించడం వెనుక మహేంద్రసింగ్ ధోని సూచనలు సలహాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు ఈ యువ ఆటగాడు. ఇక ఇటీవలే స్పోర్ట్స్ యారీ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ధోని రిటైర్మెంట్ ప్రకటించిన రోజునే మేమిద్దరం మాట్లాడుకున్నాం.. బౌలింగ్లో ఇప్పటికే నువ్వు ఏంటో ప్రూవ్ చేసుకున్నావ్.. కానీ నీ బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించలేదు..  ఇకపై బ్యాటింగ్ పై  కూడా ఫోకస్ పెట్టు దాని గురించి కూడా ఆలోచించు అంటూ ధోని సలహా ఇచ్చాడు.

 ఇక అప్పటి నుంచి బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఇక బ్యాటింగ్ లో పట్టుసాధించేందుకు ఎంతగానో కష్టపడ్డాను. ఇక గత ఏడాది శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో 82 పంతులు 69 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడటం జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇక ఆ సమయంలో బ్యాటింగ్ లో కూడా ప్రూవ్ చేసుకుంటాను అంటూ ధోనికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు దీపక్ చాహర్. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో ఏకంగా 14 కోట్లు వెచ్చించి దీపక్ చాహర్ ను చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి మెగా వేలంలో దక్కించుకుంది అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: