కోహ్లీపై రోహిత్ ప్రశంసలు.. ఏమన్నాడంటే?

praveen
విరాట్ కోహ్లీ సెంచరీ చేసి దాదాపు 2 సంవత్సరాలు గడిచి పోతుంది. దీంతో విరాట్ కోహ్లీ నుంచి ఒక సాలిడ్ సెంచరీ కావాలని అభిమానులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కోహ్లీ సెంచరీ చేయడం లేదు కానీ అవకాశం వచ్చినప్పుడల్లా హాఫ్ సెంచరీ చేస్తూ ఎప్పుడూ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల వెస్టిండీస్తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. ఇక టీమిండియాకు భారీ స్కోర్ రావడంలో కీలకపాత్ర వహించాడు విరాట్ కోహ్లి.


 తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. అయితే విరాట్ కోహ్లీ అర్థసెంచరీ చేయడంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఒత్తిడిని అధిగమించి చూడచక్కని షాట్లతో చెలరేగడం కేవలం విరాట్ కోహ్లీ కే సాధ్యమైంది రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. జట్టు విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నాడు. జట్టుకు అవసరమైన సమయంలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అని.. జట్టు బాధ్యతను తలకెత్తుకున్నాడు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.


 నిజానికి మొదటి రెండు ఓవర్లలో మా ప్రదర్శన బాగా లేదు. అయినా ఇలాంటి సమయంలో కోహ్లీపై ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ ఒత్తిడిని అధిగమించి సొగసైన షాట్లతో అదరగొట్టాడు విరాట్ కోహ్లీ. జట్టు విజయంలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. అయితే గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ ఫామ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించడం చూస్తూ ఉంటే అతనికి రోహిత్ అండగా నిలబడ్డాడు అనేది తెలుస్తుంది. అయితే రోహిత్ కోహ్లి మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వస్తున్న వార్తలు కూడా ఇక ఈ వ్యాఖ్యలతో పటాపంచలు గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: