విరాట్ కోహ్లీ పైనే గురి... ఫ్యాన్స్ వెయిటింగ్?
ఇప్పుడు వెస్ట్ ఇండీస్ సీరీస్ లోనూ తన స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాడు. అందులోనూ వన్ డే సీరీస్ లో ఒక మ్యాచ్ లో డక్ ఔట్ అవ్వడం మరిన్ని విమర్శలకు తావిచ్చింది. మొత్తానికి కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్ చూస్తుంటే ఒత్తిడిలో ఆడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మునుపటిలా కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి వచ్చి ఫ్యాన్స్ ను అలరిస్తాడని వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు వెస్ట్ ఇండీస్ మరియు ఇండియాల మధ్యన రెండవ టీ 20 జరగనుంది. కనీసం ఈ మ్యాచ్ లో అయినా ఫామ్ లోకి వస్తాడా అన్నది చూడాల్సి ఉంది.
రెగ్యులర్ గా విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వస్తున్నాడు. అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్థానాన్ని మార్చితే ఏమైనా ఫలితం ఉంటుందా? లేదా ఓపెనింగ్ లో పంపితే స్వేచ్చగా ఆడగలడా అన్న విషయాన్ని ఇండియన్ టీమ్ యాజమాన్యం ఒకసారి పరిశీలించాలి. ఈ సంవత్సరమే టీ 20 వరల్డ్ కప్ ఉండడంతో విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడం చాలా ముఖ్యం. ఈ రోజు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ప్రదర్శన గురించి ఇండియా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు అని చెప్పాలి. మరి కోహ్లీ తన ఫ్యాన్స్ ను తనదైన బ్యాటింగ్ తో ఖుషీ చేస్తాడా అన్నది తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాలి.