వైరల్ : రివేంజ్ అంటే ఇది?

praveen
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లలో ఇరు జట్ల ఆటగాళ్లు మధ్య చిన్నపాటి వివాదాలు జరుగుతూ ఉంటాయి  ఒక్కోసారి  బ్యాట్స్మెన్  లు సిక్సర్ కొట్టి నప్పుడు బౌలర్ ను రెచ్చగొట్టే విధంగా ఏదో ఒకటి చేయడం చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఇక బౌలర్ వికెట్ తీసినప్పుడు కూడా చిత్రవిచిత్రమైన సెలబ్రేషన్స్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఇక ఇలా జరగడం అటు మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరినీ కూడా తెగ ఆకర్షిస్తూ వుంటుంది. స్టార్ బౌలర్ బౌలింగ్ చేసిన సమయంలో ఎవరైనా బ్యాట్స్మెన్  కాస్త విచిత్రంగా ప్రవర్తించి ఓవరాక్షన్ చేశారంటే ఏకంగా వైవిధ్యమైన బంతులను సంధిస్తూ వికెట్ పడగొట్టటం చేస్తూ ఉంటారు బౌలర్లు.

 ఇలా వికెట్ పడింది అంటే చాలు తమదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. బ్యాట్ మేన్ లు కూడా సిక్సర్లతో నిర్ణయం తీర్చుకుంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఇటీవల యూరోపియన్ క్రికెట్ లీగ్లో ఆసక్తికర ఘటన ప్రేక్షకులు అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక బౌలర్  పై తనదైన శైలిలో బ్యాట్స్మెన్  ప్రతాపం చూపించి రివేంజ్  తీర్చుకున్నాడు. తొలుత తన బ్రిడ్జి వేల్స్ ఆటగాడు మార్కస్ ను బ్రూక్స్ జట్టు బౌలర్ అహ్మద్ జాయ్ అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత తన కుడి కాలు షూ తీసి చెవి దగ్గర పెట్టుకుని ఫోన్ మాట్లాడుతున్నాడు గా వ్యవహరించాడు.

 ఇక ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి వచ్చిన బ్రూక్స్ కెప్టెన్ షహీద్ అబ్దుల్ బౌలింగ్లో  క్రిస్ విలియమ్స్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అంతటితో ఆగకుండా అతని లాగానే  సంబరాలు చేసుకున్నాడు. తన బ్యాట్ చెవి దగ్గర పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నట్లు చేశాడు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు అందరూ కూడా అది చూసి తెగ నవ్వుకున్నారు. ఇది అసలు సిసలైన రివెంజ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. అయితే ఇప్పటికే ఇలా ఎంతో మంది క్రికెటర్లు సంబరాలు చేసుకోవడం అందరూ చూసే ఉంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: