మెగా వేలం : భారత కుర్రాళ్లు టాప్ లేపారు?
అయితే ఇక ఇప్పుడు మెగా వేలంలో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఉండగా ఊహించని రేంజ్ లో ధరను సొంతం చేసుకున్నారు యువ ఆటగాళ్ళు. నితీష్ రానా, హర్షల్ పటేల్, ఆల్రౌండర్ దీపక్ హుడా, దేవ దత్త పడిక్కాల్ లు మెగా వేలం లో పాల్గొన్నారు. ఇక ఈ అందరు ఆటగాళ్లు కూడా మెగా వేలంలో టాప్ లేపేసారు అనే చెప్పాలి. గత సీజన్లో అంచనాల కంటే ఎక్కువగా రాణించాచిన హర్షల్ పటేల్ 32 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్న బౌలర్గా అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండు కోట్ల కనీస ధరతో బరిలోకి దిగిన హర్షల్ పటేల్ను మరోసారి బెంగళూరు 10.75 కోట్లు చెల్లించి దక్కించుకుంది.
దేవ దత్త పడిక్కాల్ గత ఏడాది బెంగళూరు జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు. ఇతన్ని ఈసారి కూడా సొంతం చేసుకోవాలని ఆర్సిబి ఎంత ప్రయత్నించినప్పటికీ కుదరలేదు.. చివరికి 7.75 కోట్లకు సొంతం చేసుకుంది రాజస్థాన్ రాయల్స్. ఇక మరో యువ కెరటం నితీష్ రానా కూడా గత సీజన్లో మంచి ప్రదర్శన చేశారు. దీంతో ఈసారి మెగా వేలంలో 8 కోట్లు వెచ్చించి కోల్కత నైట్రైడర్స్ జట్టు సొంతం చేసుకుంది. ఇక యువ ఆల్రౌండర్ దీపక్ హుడాను కనీస ధర 75 లక్షలతో వేలంలో పాల్గొనగా లక్నో సూపర్ జెయింట్స్ 5.75 కోట్లు అతని దక్కించుకుంది. మెగా వేలం లో పాల్గొన్న భారత కుర్రాళ్లు అందరూ కూడా అందరి దృష్టిని ఆకర్షించి భారీ ధర పలికారు.