వార్ని.. అప్పుడే కోహ్లీని దాటేసిన రోహిత్?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో రికార్డుల రారాజు గా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన రికార్డులను కొల్లగొట్టాడు. ఎప్పుడు తనని తాను ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్తగా నిరూపించుకుంటూ వచ్చాడు కోహ్లీ. ఇలా రికార్డుల రారాజు గా పేరు తెచ్చుకున్న కోహ్లీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ  గొప్ప ఆటగాడు. కానీ విరాట్ కోహ్లీ లాగా రికార్డులు సృష్టించ గలుగు తాడు లేదా అని అందరూ అనుకున్నారు.


 అయితే కెప్టెన్సీ చేపట్టిన కొన్ని రోజుల్లో నే కోహ్లీ రికార్డును బ్రేక్ చేసేసాడు రోహిత్ శర్మ. ఇప్పటికీ కెప్టెన్ గా తన సత్తా ఏంటో నిరూపించిన రోహిత్ శర్మ ఇప్పుడు ఇది మరో సారి చేసి చూపించాడు. ఇటీవలే రోహిత్ శర్మ కెప్టెన్సీలో స్వదేశం లో వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఆడింది టీమిండియా. తనదైన వ్యూహాల తో జట్టును ముందుకు నడిపించిన రోహిత్ శర్మ మూడు మ్యాచ్ లలో కూడా విజయాన్ని అందించాడు. ఇక ఇటీవల జరిగిన చివరి వన్డే మ్యాచ్లో 96 పరుగుల తేడా తో భారీ విజయాన్ని అందుకుంది టీమిండియా.. దీంతో సిరీస్ కైవసం చేసుకుంది.


 ఇక ఈ విజయం తో అటు రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీని అధిగమించాడు. ఇప్పటి వరకు 13 వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించాడు.. కాగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 11 విజయాలను సాధించింది. కాగా సరిగ్గా 13 మ్యాచ్ లకి గతం లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా 10 విజయాల తో మాత్రమే సరి పెట్టుకుంది. దీంతో కెప్టెన్గా ఇక వన్డే లలో 13 మ్యాచ్ లలో ఎక్కువ విజయాలు సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: