"మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పనైపోయిందా"... ?

VAMSI
గత 8 నెలల నుండి ఇండియన్ మాజీ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి గడ్డు కాలం నడుస్తోంది అని చెప్పాలి. సరిగ్గా 2021 టీ 20 వరల్డ్ కప్ నుండి కోహ్లీ కి టైం బాగోలేదు. అయితే ఇది అంతకు ముందు ఐపిఎల్ సీజన్ 2021 నుండి మొదలైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ముందు నుండి కూడా విరాట్ కోహ్లీ ఒక ఆటగాడిగా మంచి ప్రదర్శన ఇవ్వడం కన్నా, కెప్టెన్ మరియు ఆటగాడిగా ఉండడాన్ని ఎక్కువగా ఇష్టపడుతాడు మరియు 100 శాతం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ వరుసగా ఐపిఎల్ లో ఆర్సీబీ కెప్టెన్ గా రిజైన్ చెయ్యడం, ఆ తర్వాత జరిగిన టీ 20 వరల్డ్ కప్ తోనూ తన కెప్టెన్సీని వదిలేయడం. ఇలా ఒక్కొక్కటిగా అన్ని ఫార్మాట్ ల నుండి కెప్టెన్ గా వైదొలిగాడు.

అయితే కెప్టెన్ గా లేని కోహ్లీ మైదానంలో ఏ మాత్రం చురుకుగా లేడు. మునుపటిలా ఆ ఆవేశం, పదునైన మాటలు, ప్రత్యర్థిపై ఎదురుదాడి వ్యూహాలు వంటివి కనిపించలేదు. ఇది మాత్రమే కాకుండా కోహ్లీ ఒక ప్లేయర్ గా రాణించడంలో ఫెయిల్ అయ్యాడు. గత నెలలో జరిగిన సౌత్ ఆఫ్రికా పర్యటన నుండి ఇప్పుడు జరుగుతున్న వెస్ట్ ఇండీస్ సీరీస్ వరకు కోహ్లీ నుండి చక్కని ప్రదర్శనకు  భారత్ అభిమానులు నోచుకోలేక పోయారు. అసలు కోహ్లీకి ఏమైందంటూ ఒకవైపు అభిమానులు మరియు టీమ్ యాజమాన్యం కంగారు పడుతున్నారు. అయితే తన పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తే మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక కెప్టెన్ గా కొనసాగడానికి కొలమానాలు ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కునే పనిలో కోహ్లీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్లేయర్ గా సరిగా ఆడకపోవడం వల్లనే కెప్టెన్ గా కోహ్లిని కొనసాగించడానికి యాజమాన్యం అంగీకరించలేదా? లేదా  ఇంకేదైనా సమస్య ఉందా అనే కోణంలో కోహ్లీ అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే ఈ రెండు సీరీస్ ల ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకున్న కొందరు ఇక విరాట్ పని అయిపోయిందని, కెరీర్ క్లోజ్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మరి వీలైనంత తొందరగా మళ్లీ కోహ్లీ గాడిలో పడి ఎప్పటి లాగే ఒక బ్యాట్స్మన్ గా ప్రపంచం లో ఉన్న తన అభిమానులు అందరినీ అలరించాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: