8 కిలోలు తగ్గిన రోహిత్.. ఇప్పుడు మరో ప్రమోషన్?

praveen
భారత క్రికెట్లో సక్సెస్ఫుల్ కెప్టెన్ గా  పేరు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. సౌత్ఆఫ్రికా పర్యటనలో టీమిండియా టెస్టు సిరీస్ ఓడిపోయిన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. కోహ్లీ  తీసుకున్న నిర్ణయంతో ఇక 3 ఫార్మాట్లా నుంచి విరాట్ కోహ్లీ కెప్టెన్ గా తప్పుకున్నట్లు అయ్యింది.. అయితే  కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఇక టెస్ట్ ఫార్మట్ కి తర్వాత కెప్టెన్ ఎవరు అనే దానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీనియారిటీ అనుభవం ప్రకారం కోహ్లీ తర్వాత కెప్టెన్సీ తగ్గించుకునేది  రోహిత్ శర్మ అని అందరూ అనుకున్నారు.



 కానీ రోహిత్ శర్మ ఫిట్గా లేడని తరచు గాయాల బారిన పడుతూ జట్టుకు దూరమవుతున్నాడని.. అలాంటి ఆటగాడిని కెప్టెన్ గా మారిసతే ఇక టెస్ట్ ఫార్మాట్ కి ఎంతో ఇబ్బంది ఏర్పడుతుంది అని ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కె.ఎల్.రాహుల్ రిషబ్ పంత్ లాంటి యువ ఆటగాళ్లకు టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు ఇస్తే బాగుంటుందని.. ఇలాంటి ఆటగాళ్లు ఎప్పుడు టెస్ట్ జట్టుకు అందుబాటులో ఉంటారూ అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇక టెస్ట్ కెప్టెన్ గా ఎవరు కాబోతున్నారు అన్న దానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. అయితే అందరూ అనుకున్నట్లుగానే పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ టెస్ట్ లకు కూడా కెప్టెన్ గా  అవతరించే పోతున్నాడని తెలుస్తోంది.



 ఇక మరికొన్ని రోజుల్లో భారత టెస్టు  సారథిగా రోహిత్ శర్మ పేరును బిసిసిఐ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ ఫిట్ గా ఉండటంతో బిసిసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇన్సైడ్ స్పోర్ట్ అనే క్రికెట్ వెబ్సైట్ తెలపడం గమనార్హం. ఇటీవలే గాయం బారినపడిన రోహిత్ శర్మ నేషనల్ క్రికెట్ అకాడమీ లో రెండు నెలలపాటు ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకున్నాడు.  8 కేజీల బరువు తగ్గి ఇక ఇప్పుడు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు. దీంతో ఇక రోహిత్ శర్మ ను టెస్ట్ కెప్టెన్ గా బిసిసీఐ త్వరలో ఖరారు చేయబోతున్నదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: