కోహ్లీ - రోహిత్ మధ్య గొడవలు.. సునీల్ గవాస్కర్ ఏమన్నాడంటే?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య ఎన్నో రోజుల నుంచి అంతర్గత విభేదాలు కొనసాగుతూ వస్తున్నాయని ఒకరితో ఒకరికి అసలు మాట్లాడుకోవడం లేదని ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయ్. ఇటీవలే కెప్టెన్సీ మార్పు జరగడం మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది. నిన్నటివరకు కకెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడతాడా లేదా అని కూడా ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూశారు.



 ఇటీవల రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఒక స్పెషలిస్టు బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ ఎప్పటిలాగానే మైదానంలో కనిపించాడు. అంతేకాదు ఒకానొక సమయంలో ఓ డిఆర్ఎస్ విషయంలో రోహిత్ శర్మకు  ఒక విలువైన సలహా కూడా ఇచ్చాడు విరాట్ కోహ్లీ.  తన ఆలోచనలు కెప్టెన్ రోహిత్ శర్మ చెబుతూనే మరోవైపు ఆటగాళ్లకు ప్రోత్సాహం కూడా అందించాడు. ఇకపోతే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మధ్య అంతర్గత విభేదాలతో ఇటీవల సునీల్ గవాస్కర్ స్పందించాడు. రోహిత్ కోహ్లీ ల మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వస్తున్న వదంతులను కొట్టిపారేశాడూ సునీల్ గవస్కర్.


 అవాస్తవాలను ప్రచారం చేయొద్దు అంటూ మీడియాపై మండిపడ్డాడూ. వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ సూచన మేరకే డిఆర్ఎస్  కోరుకుని రోహిత్ వికెట్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ ఒక్కటే ఇలా వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అన్న దానికి నిదర్శనంగా  మారింది అంటూ గవాస్కర్ అన్నాడు  రోహిత్ కోహ్లీ ఇద్దరు కూడా భారత జట్టు కోసం కష్ట పడుతున్నారు అని అలాంటప్పుడు వారిద్దరి మధ్య విభేదాలు ఎందుకు ఉంటాయి అని ప్రశ్నించాడు. వీరి మధ్య విభేదాలు ఉన్నాయ్ అంటూ మీడియాలో వస్తున్నవీ వదంతులు మాత్రమేనని. అసలు నిజమెంటో వారిద్దరికీ మాత్రమే తెలుసు. అందుకే ఇలాంటి వదంతులు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారని సునీల్ గవాస్కర్ అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: