యువరాజ్ వీడియోలు చూసి.. బ్యాటింగ్ నేర్చుకున్నా?

praveen
మినీ ప్రపంచకప్ గా పిలుచుకునే  అండర్-19 ప్రపంచకప్ లో టీమిండియా అదరగొట్టింది.. ఫైనల్ మ్యాచ్లో ప్రత్యర్థి ఇంగ్లాండ్ ను చిత్తుచేసి భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది.. ఈ క్రమంలోనే కుర్రాళ్ళ జట్టు ఏకంగా ఐదవ సారి మినీ వరల్డ్ కప్ ని ముద్దాడింది అనే చెప్పాలి.. ఇక భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసిన తీరు క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా మంత్రముగ్దుల్ని చేసింది. భారత కుర్రాళ్లు అందరూ సమిష్టిగా రాణించి వరల్డ్ కప్ అందుకోవడంతో ఎంతో మంది మాజీ ఆటగాళ్లు దీనిపై స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 ఇక ఈ వరల్డ్ కప్ లో ఎవరు ఎలా రాణించారు అన్న విషయం కోసం సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే యువ ఆల్రౌండర్ ప్రపంచ కప్ హీరో రాజ్ బావ వరల్డ్ కప్ లో తన అనుభవాలను ఇటీవల మీడియాతో చెప్పుకొచ్చాడు.. భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ తనకు రోల్ మోడల్ అంటూ చెప్పుకొచ్చాడు రాజ్ బవ.  ఇక యువరాజ్ సింగ్ ను చూసి తాను క్రికెటర్ అవ్వాలి అనుకున్నానని అతన్ని చూసి ఇక బ్యాటింగ్లో రాణించటం కూడా నేర్చుకున్నాను అంటూ చెబుతున్నాడూ.

 మా నాన్న సుఖ్ విందర్ సింగ్ యువరాజ్ సింగ్ కు శిక్షణ ఇచ్చారు. దీంతో చిన్నప్పటినుంచి యువి ని చూస్తూ పెరిగాను. ఇక అతని లాగానే బ్యాటింగ్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని.. చిన్నప్పటినుంచీ అతని వీడియోలు చూసి బ్యాటింగ్ చేయడం నేర్చుకున్నాను.. అతను రోల్ మోడల్ అంటూ రాజ్ బవా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇటీవల ప్రపంచ కప్లో భాగంగా ఫైనల్ మ్యాచ్ లో ఏకంగా 31 పరుగులు చేయటమే కాదు.. 5 వికెట్లు సాధించాడు రాజ్ బవ. ఇక ఐసీసీ టోర్నీ ఫైనల్లో టీమ్ ఇండియా తరఫున ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలిభారత క్రికెటర్గా రాజ్ బవా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇక రాజ్ బావ కుటుంబంలో కూడా తాతల కాలం నుంచి క్రీడాకారూలే ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: