కుమ్మేశారు.. వరల్డ్ కప్ టీమ్ ఇండియాదే?
బౌలింగ్ విభాగం నుంచి బ్యాటింగ్ విభాగం వరకూ అద్భుతం గా రాణించారు.. కానీ అంతలోనే కరోనా వైరస్ కక్ష కట్టినట్లు వివరించింది. ఏకంగా కెప్టెన్ వైస్ కెప్టెన్ సహా మరో నలుగురు ఆటగాళ్లపై పంజా విసిరింది. దీంతో కీలకమైన ఆటగాళ్లు ఐసొలేషన్ కే పరిమితం కావాల్సిన పరిస్థితులు. దీంతో టీమిండియా పని అయిపోయినట్టేనా అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలోకేవలం కొంత మంది ఆటగాళ్లను నమ్ముకొని జట్టు లేదు అన్న విషయాన్ని మిగతా ఆటగాళ్లు నిరూపించారు. కెప్టెన్ వైస్ కెప్టెన్ దూరమైనప్పటికీ మిగతా ఆటగాళ్లు వీరోచితంగా పోరాటం చేశారు..
కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్లో కరోనా వైరస్ ను జయించిన కెప్టెన్ వైస్ కెప్టెన్ మళ్ళీ తిరిగి వచ్చారు.. మళ్లీ మునుపటిలా మరింత పటిష్టంగా మారిపోయింది టీమిండియా జట్టు. ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్ ను ఓడించి మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. టాస్ గెలిచి గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. భారత బౌలర్లు విజృంభించడంతో 44.5 ఓవర్లకే 189 పరుగులు చేసింది. ఇక ఆ తరువాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు అద్భుతంగా రాణించింది. కేవలం ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కాగా కుర్రాళ్ల ప్రతిభకు యావద్దేశం ఫిదా అయ్యింది.