బిసిసిఐ అధ్యక్ష పదవిపై.. సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్?
ఇలా కట్టుదిట్టమైన క్వారంటైన్ లో ఉంచుతూ మ్యాచ్ లు కొనసాగిస్తున్నారు. అచ్చంగా క్రికెట్లో కూడా ఇదే జరుగుతుంది అని చెప్పాలి. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి గురించి చెప్పాల్సివస్తే ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటూ ఒకవైపు ద్వైపాక్షిక సిరీస్ లను మాత్రమే కాదు మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాంటి దేశవాళీ క్రికెట్ టోర్నీ లను కూడా నిర్వహిస్తూ ముందుకు సాగుతుంది బీసీసీఐ. ముఖ్యంగా బిసిసిఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎన్నికైన నాటి నుంచి ఎన్నో సవాళ్ళు ఎదుర్కున్నారు అని చెప్పాలి.. అయితే ఇటీవల పీసీసీ అధ్యక్ష పదవి గురించి స్పందించిన సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా జట్టును కెప్టెన్గా ముందుకు నడిపించడం కంటే బిసిసిఐ అధ్యక్ష పదవిని పోషించడం కష్టమైనది కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక బిసిసిఐ బోర్డు అధ్యక్షుడిగా నేను ఎలా పనిచేశాను అన్నది జనమే చెబుతారూ అంటూ చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్ల నుంచి కఠిన పరిస్థితులలో పని చేశామని గుర్తు చేశారు. మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేసిన.. చాలావరకు క్రికెట్ కొనసాగేలా చూడడం అదృష్టం అంటూ ఇటీవల సౌరవ్ గంగూలీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఇలాంటి కఠిన పరిస్థితులను మధ్యనే ఐపీఎల్ ముంబై పూణే లలో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారూ. భవిష్యత్తులో మహిళా క్రికెటర్ ల సంఖ్య పెరిగితే పెద్ద టోర్నీని నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చారు సౌరవ్ గంగూలీ .