టీమిండియా మళ్ళీ కుమ్మేసింది.. మిగిలింది అదొక్కటే?

praveen
భళా డింబక భళా.. అందరూ తప్పక విజయం సాధిస్తారు.. ఆ దేవి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి.. ఏదో సినిమా లో డైలాగుల్లా అనిపిస్తున్నాయి కదా.. ఏంటోనండి ఈ విషయం తెలిసిన తర్వాత ఏం మాట్లాడుతున్నానో.. అర్థం కావట్లేదు. కానీ ఏదో ఒకటి మాత్రం మాట్లాడాలి అనిపిస్తుంది.. అంత ఆనంద పడి పోతారు మీరు కూడా ఆ విషయం తెలిస్తే.. ఇంతకీ ఆ విషయం ఏంటి అని ఆతృత పడుతున్నారు కదా. అదేంటో కాదు మన టీమ్ ఇండియా గురించి.. అద్భుతం మహాద్భుతం.. వావ్.. సూపర్.. బ్రిలియంట్  ఇలా ఎన్ని భాషల్లో మెచ్చుకున్న వారి ప్రతిభకు తక్కువేనేమో.. అవును మరి.. ఆ రేంజ్ లో సత్తా చాటుతున్నారు మన కుర్రాళ్లు. అదేనండి మన అండర్ 19 టీమిండియా జట్టులో ని కుర్రాళ్ళు.


 ప్రస్తుతం అండర్-19 ప్రపంచ కప్ జరుగుతుంది. అయినా ఇది ప్రత్యేకంగా చెప్పాలా.. మీకు గుర్తుండే ఉంటుంది లేండి. ఈ ప్రపంచకప్లో  మన భారత కుర్రాళ్లు సత్తా చాటుతూ వరుస విజయాలతో దూసుకుపోతున్న తీరు క్రికెట్ ప్రేక్షకులందరినీ సంతోషంలో ముంచెత్తుతోంది. అబ్బ ఏం ఆడుతున్నారు.. నెవర్ బిఫోర్ అన్నట్లుగా  భారీ విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థి ఎవరైనా సరే మాకేంటి చిత్తుగా ఓడించడం మా లక్ష్యం అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. పసికూన లాంటి జట్లపైనే కాదు క్రికెట్ ప్రపంచంలో దిగ్గజాలు గా కొనసాగుతున్న  జట్లపై భారీ విజయాలను అందుకున్నారు.



 ప్రతి మ్యాచ్లో కూడా 'రాసుకోరా సాంబ ఈ మ్యాచ్ కూడా మాదే' అన్నట్లుగా ఇరగదీస్తున్నారు. ఇక ఇటీవలే అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది భారత జట్టు. ఇక ఈ మ్యాచ్లో భారత్ జోరు కొనసాగించి విజయం సాధిస్తుందా లేదా అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.  మరోసారి తిరుగులేదు అని నిరూపించారు మన కుర్రాళ్ల.   మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 291 పరుగులు చేయగా భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ విభాగం  భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిపోయింది. 194 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక అంతకుముందు కరోనా మహమ్మారినీ జయించి జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ యష్  110 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించాడు. వైస్ కెప్టెన్ షేక్ రషీద్ 94 పరుగులతో రాణించాడు. ఇక ఈ విషయం గురించి తెలిసిన తరువాత క్రికెట్ ప్రేక్షకులందరూ భళా డింబక భళా అని అనకుండా ఉండలేకపోతున్నాను. టీమ్ ఇండియా ఫైనల్ లో కూడా అదరగొట్టాలంటు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: