'అధర్వ' గా ధోనీ లుక్.. చేతిలో కత్తి పట్టుకుని ఎలా ఉన్నాడో చూడండి?
భారత క్రికెట్ కోసం ఎంతో మంది యువ ఆటగాళ్లను మెరుగ్గా తీర్చిదిద్ది.. ఇండియన్ క్రికెట్ భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాడు మహేంద్రసింగ్ ధోని. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అప్రస్తుతం ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటికే జట్టుకి నాలుగు సార్లు టైటిల్ అందించి అక్కడ తన కెప్టెన్సీకి తిరుగులేదు అని నిరూపించుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి అతని క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి.
ఇప్పుడు మార్చి చివర్లో జరగబోయే ఐ.పి.ఎల్ ఆడేందుకు సిద్ధమైపోతున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 'అధర్వ' మోషన్ పోస్టర్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఇక ఈ పోస్టర్ లో ధోని సిక్స్ ప్యాక్ తో కత్తి చేతిలో పట్టుకొని కనిపిస్తున్నాడు. ఆగండాగండి మోషన్ పోస్టర్ అంటున్నారు కొంప తీసి మా ధోని ఏమైనా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడా ఏంటి అంటూ షాక్ అవుతున్నారు కదా.. సినిమా కాదు నవల. ధోని ప్రధాన పాత్రగా అధర్వ అనే నవల రాస్తున్నాడు సంగీత దర్శకుడు రమేష్ తమిళ్ మనీ. ఇది గ్రాఫిక్ నవల. ఇందులో కత్తి పట్టి కనిపిస్తున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఇక ఈ పోస్టర్ పై స్పందించిన మహేంద్రుడు ఈ ప్రాజెక్టు తో అనుసంధానం అయినందుకు సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.