కోహ్లీ కి షాక్.. అతడి సలహాతోనే ఎదిగాను అంటున్న చాహల్?

praveen
భారత క్రికెట్లో ప్రస్తుతం స్టార్ బౌలర్ గా కొనసాగుతున్నాడు యుజ్వేంద్ర చాహల్. తన స్పిన్ బౌలింగ్ తో ఎప్పుడూ మ్యాజిక్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతి సారి కూడా కీలకమైన వికెట్లను పడగొడుతూ ఉంటాడు. అయితే కేవలం అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రమే కాదు అటు ఐపీఎల్ లో కూడా సత్తా చాటుతూ అదరగొడుతు ఉంటాడు.  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు  ఒక రకంగా చెప్పాలంటే కెప్టెన్ కోహ్లీకి ప్రియమైన బౌలర్ కూడా యుజ్వేంద్ర చాహల్ అని చెప్పాలి.


 అయితే సాధారణంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో ఏ ఆటగాడైనా సరే కోహ్లీ తమకు ఇచ్చిన సహకారంతోనే బాగా రాణించగలిగాము అంటూ చెబుతూ ఉంటారు. కోహ్లీ ఇచ్చిన సలహాల తోనే నాణ్యమైన క్రికెటర్గా ఎదగగలిగాము  అంటూ చెబుతూ ఉంటారు. ఇలా ఇప్పటి వరకూ ఎంతో మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో ఉన్న ఆటగాళ్ళు కోహ్లీ వల్లే తమ కెరీర్ మారిపోయింది అంటూ చెప్పటం చూసాం.. కానీ ఇప్పుడు అదే జట్టులో కీలక స్పిన్నర్ గా కొనసాగుతున్న  చాహల్ కోహ్లీ పేరు చెప్పకుండా మరోకరి పేరు చెప్పడం గమనార్హం.


 టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన యుజ్వేంద్ర చాహల్ పలు విషయాలను వెల్లడించాడు. 2014లో తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి అడుగుపెట్టే సమయంలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు డేనియల్ వెట్టోరి హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఇక నేను నాణ్యమైన  బౌలర్ గా మారడానికి ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చాడు. నా బౌలింగ్ యాక్షన్ మార్చుకోకుండా వైవిధ్యమైన బంతులు ఎలా సందించాలి అని సలహాలు ఇచ్చే వాడు.. ఆయన ఇచ్చిన సలహాలతో నేను స్పిన్ బౌలింగ్  లో మరింత మెరుగయ్యా అంటూ  చాహల్ చెప్పుకొచ్చాడు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను బంతులతో తికమక పెట్టాలని.. అలాంటప్పుడే వికెట్ దక్కుతుందని డేనియల్ వెట్టోరి చెప్పాడు అంటూ గుర్తుచేసుకున్నాడు చాహల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: