రవిశాస్త్రి 2.0.. అస్సలు అర్థం కావట్లేదు?
ఈ క్రమంలోనే గతంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి షాకింగ్ కామెంట్ చేశాడు అన్న విషయం తెలిసిందే. కోహ్లీ ఖచ్చితంగా మరో రెండేళ్లపాటు కెప్టెన్గా ఉండేవాడని.. రానున్న రోజులో భారత జట్టు ఆడబోయే సిరీస్ లన్ని స్వదేశంలోనే కాబట్టి టెస్ట్ ర్యాంకింగ్స్ లో అట్టడుగు స్థానంలో ఉన్న జట్లతోనే కాబట్టి అతడు మరికొంత కాలం కొనసాగే ఈ అద్భుతమైన విజయాలు సాధించేవాడు అంటూ రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ సాధించిన ఘనతను జీర్ణించుకోలేక అతనిపై ఒత్తిడి తీసుకొచ్చి.. కెప్టెన్సీ వదులుకునేలా చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు మాజీ కోచ్ రవిశాస్త్రి.
ఇక రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి. ఇక తాజాగా ఇదే విషయంపై స్పందించిన మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ రవిశాస్త్రి కామెంట్స్ ని తప్పుపట్టాడు. రావిశాస్త్రిని విమర్శించాలని ఆలోచన నాకు అస్సలు లేదు. అతని కెప్టెన్సీలో అప్పుడు నేను కూడా ఆడాను.. అతడికి పెద్ద అభిమానిని కూడా.. కెప్టెన్గా ఉన్నప్పుడు అతను ఆటగాళ్లకు మద్దతుగా నిలిచే వాడు. కానీ రవిశాస్త్రి 2.0 మాత్రం అస్సలు అర్థం కావడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పుడే కాదు ఎప్పుడూ అతను తెలివైన వ్యాఖ్యలు మాత్రం చేయడు. అతని కామెంట్ వెనుక మర్మమేమిటో కూడా అందరికీ అర్థమైపోతుంది. ఇలాంటిది భారత క్రికెట్ లో అస్సలు మంచిది కాదు అంటూ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.