అదృష్టం అంటే ఇదే.. ఇలా జరుగుతుందని ఎవరు అనుకుంటారు?
ఇందులో భాగంగా శ్రీలంక ఆఫ్గనిస్తాన్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో శ్రీలంకను దురదృష్టం వెక్కిరించింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది శ్రీలంక జట్టు. బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాట్మెన్ అటు ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. మొత్తంగా చూసుకుంటే 134 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ జట్టు అలౌట్ అయ్యింది.
అతి స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కు మాత్రం ఊహించని దెబ్బ తగిలింది అని చెప్పాలి. ఓపెనర్ 16 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక మిడిల్ ఆర్డర్ కూడా చేతులెత్తేసింది. ఆ తర్వాత ఆటగాళ్లు ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఇక గణాంకాలు చూసుకుంటే శ్రీలంక జట్టు గెలవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఇక 25 బంతులు ఉన్న సమయంలో కేవలం చేయాల్సింది ఐదు పరుగులు మాత్రమే. కానీ వినుజ రన్ పాల్ 11 పరుగులతో క్రీజులో ఉన్న సమయంలో దురదృష్టం వెంటాడి చివరికి రన్నవుట్ అయ్యాడు. దీంతో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి ఆఫ్ఘనిస్తాన్ సత్తా చాటింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి అని చెప్పాలి.