అందుకే ఓడిపోయాం.. దావన్ ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
ఇటీవలే సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్లో టీమిండియా ఆడిన మొదటి వన్డే మ్యాచ్లో ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా 31 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది సౌత్ ఆఫ్రికా జట్టు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా జుట్టు అద్భుతంగా రాణించింది అనే చెప్పాలి. ఏకంగా ఇద్దరు ఓపెన్లు కూడా సెంచరీలతో చెలరేగడంతో 5 వికెట్ల నష్టానికి 50 ఓవర్లకు 296 పరుగులు చేసింది సౌతాఫ్రికా జట్టు. అయితే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే దెబ్బ పడింది.  కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయాడు.

 ఇక ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ నూ చక్కదిద్దెందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే టీమిండియాలో విజయం సాధిస్తుందనే ఆశలను రేకెత్తించారూ. అయితే ఇక విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ తప్ప ఆ తర్వాత వచ్చిన మిగతా ఆటగాళ్లు అందరూ కూడా తక్కువ స్కోరుకే వికెట్ కోల్పోయి పెవిలియన్ చేరడంతో చివరికి టీమిండియాకు ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన టీమిండియా 265 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 31 పరుగుల తేడాతో సౌతాఫ్రికా జట్టు మొదటి వన్డే మ్యాచ్లో విజయం సాధించింది. అయితే ఇక టీమిండియా ఓటమి పై స్పందించిన ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 నేను విరాట్ కోహ్లీ స్కోర్ బోర్డు ముందుకు నడిపించాము.. అయితే  వికెట్ ఎంతో నెమ్మదిగా ఉంది. మంచు ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. అందుకే మిడిలార్డర్లో బ్యాటింగ్ కి వచ్చినప్పుడు భారీ షాట్లు ఆడటం అంత సులభమైన పని కాదు. అయితే మేము ఈ మ్యాచ్ లో సెంచరీ భాగస్వామ్యం కూడా నమోదు చేయలేకపోయాం. మేం వరుసగా వికెట్లు కోల్పోవటం మా బ్యాటింగ్ యూనిట్పై ఎంతగానో ప్రభావం చూపించింది. కానీ అటు దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లు మాత్రం అద్భుతంగా ఆడారు. అందుకే టీమిండియా ఓడిపోవాల్సినా పరిస్థితి ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చాడు శిఖర్ ధావన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: