ఏంటీ.. రోహిత్ కాదు.. టెస్ట్ కెప్టెన్ గా అతనా?

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియాలో కెప్టెన్సీ మార్పులకు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. గత ఏడాది టి20 వరల్డ్ కప్ కి ముందు టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఇక విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత టి20 లకు అటు రోహిత్ శర్మకు కెప్టెన్ గా నియమిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఇక ఆ తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్కు ఇద్దరూ కెప్టెన్లు ఉండటం అటు భారత జట్టుకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు అంటూ తెలిపిన బీసీసీఐ ఇక వన్డే కెప్టెన్సీ నుంచి కూడా విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు వన్డే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇక వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీనీ తప్పించడం వివాదం గానే మారిపోయింది అని చెప్పాలి.


 అయితే ఇక విరాట్ కోహ్లీ కేవలం టెస్టు కెప్టెన్గా మాత్రమే కొనసాగుతాడని ప్రేక్షకులు అందరూ భావించారు. అయితే ఇటీవల సౌత్ పర్యటనలో భాగంగా ఇక విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడిన టీమిండియా ఓటమి పాలయింది. ఇక సిరీస్ను ఓడిపోయిన 24 గంటల్లోనే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ విరాట్ కోహ్లీ  ప్రకటించడం సంచలనంగా మారిపోయింది. దీంతో ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇక మరికొన్ని రోజుల్లో టెస్టు కెప్టెన్గా కూడా అవతరించ పోతున్నాడు అని అందరూ అనుకుంటున్నారు.

 ఏకంగా మూడు ఫార్మాట్లలో రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో ముందుకు నడిపించపోతున్నాడు అని అనుకుంటున్న సమయంలో గతంలో బిసిసిఐ చెప్పిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయ్. పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి ఒక కెప్టెన్ టెస్ట్ ఫార్మాట్ కి ఒక కెప్టెన్ ఉంటే బాగుంటుంది అంటూ బిసిసీఐ అధికారులు తెలిపారు.  ఈ క్రమంలోనే ద టెస్ట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న నేపథ్యంలో రోహిత్ శర్మకు కాకుండా కేఎల్ రాహుల్ కు టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. రోహిత్ శర్మ లాంటి సీనియర్ ని వదిలేసి కె.ఎల్.రాహుల్ కు కెప్టెన్సీ అప్పగించడం ఏంటి అని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: