టీమిండియా చెత్త రికార్డు.. ఇలా జరిగిందేంటి?

praveen
ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా మొట్టమొదటిసారి టెస్టు సిరీస్లో విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే అన్నీ మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తూ ఉండటం గమనార్హం. అయితే టెస్టు సిరీస్ గెలిచి సరికొత్త రికార్డులు సృష్టించడానికి ముందే టీమిండియా ఒక చెత్త చేసుకుంది.  ఇక ఇప్పుడు టెస్ట్ సిరీస్లో భాగంగా మూడవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.. అయితే మూడు టెస్టుల సిరీస్ లో అత్యధిక క్యాచ్ అవుట్ లు అయినా జట్టుగా ఇటీవలే టీమిండియా ఒక చెత్త రికార్డు నెలకొల్పింది.
 నేడు మూడవ టెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో భాగంగా రబడ వేసిన బౌలింగ్లో అజింక్య రహానే ఒకే ఒక పరుగు చేసి సౌతాఫ్రికా కెప్టెన్ ఎల్గర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంతకుముందు మ్యాచ్లో కాస్త కుదుర్చుకున్నట్లు కనిపించిన అజింక్య రహానే విజేతను నిర్ణయించే కీలకమైన మ్యాచ్లో మాత్రం చేతులెత్తేయడంతో భారత అభిమానులు అందరూ ఎంతగానో నిరాశలో మునిగిపోయారు.. కీలకమైన మూడో మ్యాచ్లో ఆచితూచి ఆడాల్సింది పోయి ఇలా వికెట్ చేజార్చుకోవటం ఏంటి అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

 ఇకపోతే ఇక రహానే క్యాచ్ అవుట్ అవ్వడం తో పాటు భారత జట్టు ఒక చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్లో భాగంగా 49 మంది భారత బ్యాట్స్మెన్లు ప్రత్యర్థులకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యి వెను తిరగడం గమనార్హం.  ఈ చెత్త రికార్డు గతంలో పాకిస్థాన్ జట్టు పేరిట ఉండేది. 2009లో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో 48మంది పాకిస్థాన్ ఆటగాళ్లు క్యాచ్ అవుట్ రూపంలోనే పెవిలియన్  చేరారు. ఇప్పుడు భారత జట్టు ఈ చెత్త రికార్డును బ్రేక్ చేసి తన పేరిట లిఖించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం సౌతాఫ్రికా భారత్ మధ్య ఎంతో ఉత్కంఠ భరితంగా పోరు జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: