మొన్నే వచ్చాడు.. అంతలోనే మయాంక్ అరుదైన ఘనత?

praveen
అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసే ప్రతి యువ ఆటగాడికి అరుదైన రికార్డులు సాధించాలి అనే కళ ఎప్పుడూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్లో రికార్డు సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతు ఉంటారు. అతి తక్కువ సమయంలోనే తమ ప్రతిభతో అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. ఇక ప్రస్తుతం భారత యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్  ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఐపీఎల్ లో అద్భుతం గా రాణిస్తున్న మయాంక్ అగర్వాల్ అంతర్జాతీయ క్రికెట్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ  అదరగొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా అన్నీ ఫార్మాట్లలో కూడా తన దూకుడైన బ్యాటింగ్ తో అందరి చూపులు తన వైపుకు తిప్పుకున్నాడు మయాంక్ అగర్వాల్.

 ఇక ఇటీవలే టెస్ట్ ఫార్మాట్ లో అయితే మయాంక్ అగర్వాల్ భారీగా పరుగులు చేస్తూ సత్తా చాటుతూ ఉండటం గమనార్హం. టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకునీ టీమిండియా  విజయం సాధించడంలో మయాంక్ అగర్వాల్ కీలకపాత్ర వహించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా టెస్ట్ ఫార్మాట్ లో అద్భుతంగా రాణించిన మయాంక్ అగర్వాల్ కు ఇక ఇప్పుడు అరుదైన గౌరవం దక్కబోతోంది అన్నది అర్ధమవుతుంది. ఐసీసీ ప్రకటించిన అవార్డులను దక్కించుకోవాలని ప్రతి ఆటగాడు భావిస్తూ ఉంటాడు. అయితే ఇది మయాంక్ అగర్వాల్ కి కొన్ని రోజుల్లోనే సాధ్యం అయింది అని చెప్పాలి.

 ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో భారత యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ నిలిచాడు. డిసెంబర్ నెలలో అవార్డు కోసం ఐసిసి కుదించిన జాబితాలో మయాంక్ తోపాటు పాకిస్థాన్ ఆటగాడు అజాజ్ పటేల్, మిచెల్ స్టార్క్ లు కూడా స్థానం దక్కించుకోవడం గమనార్హం. ఇక మయాంక్ అగర్వాల్ రెండు మ్యాచుల్లో 69 సగటుతో 276 పరుగులు చేశాడు. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన వరుసగా రెండు ఇన్నింగ్స్ లో 150,, 62 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా అవార్డు దక్కించుకున్నాడు మాయంక్ అగర్వాల్. ఇటీవలే సెంచురియాన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో కూడా టీమిండియా విజయంలో తన పాత్ర వహించాడు. 62 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: