పంత్ ను పక్కన పెట్టేందుకు.. కోహ్లీ సన్నాహాలు?

praveen
ప్రస్తుతం భారత్ సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ఆడుతున్న టెస్టు సిరీస్ ఉత్కంఠభరిత గా మారిపోయింది. టెస్ట్ సిరీస్లో భాగంగా భారత్ మొదటి మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించింది. దీంతో ఇదే దూకుడుతో రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా భారత జట్టు విజయం సాధిస్తుంది అని అందరు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా టీమిండియాకు  షాక్ తగిలింది. రెండో మ్యాచ్లో అద్భుతంగా పుంజుకున్న సౌతాఫ్రికా జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్లో 1-1 తో సమం చేసింది సౌతాఫ్రికా జట్టు. దీంతో మూడవ టెస్ట్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా మారిపోయింది. విజేతను నిర్ణయించే ఆఖరి టెస్ట్ మ్యాచ్లో ఏ జట్టు ఎలా రాణించ పోతుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. జనవరి 11వ తేదీన కేప్ టౌన్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే రెండవ టెస్ట్ మ్యాచ్లో వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైన విరాట్ కోహ్లీ మళ్లీ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించిన మూడో టెస్ట్ మ్యాచ్లో జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో కోహ్లీ తుది జట్టులోకి వస్తే హనుమ విహారి మరోసారి బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. అయితే మూడవ టెస్ట్ మ్యాచ్ కోసం అటు జట్టు ఎంపిక ఎంతో కీలకంగా మారబోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా జోహన్నెస్బర్గ్ వేదికగా రెండవ ఇన్నింగ్స్ సమయంలో అద్భుతంగా రాణిస్తాడు అనుకుంటే వికెట్ పారేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు రిషబ్ పంత్.


 అంతకుముందు మ్యాచ్ లలో కూడా రిషబ్ పంత్ అంతగా రాణించలేదు. దీంతో అతని జట్టు నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్ ను జట్టు నుంచి పక్కనపెట్టి  వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కు అవకాశం కల్పించాలి అని ఎంతో మంది మాజీ లు కూడా సూచిస్తూ ఉండటం గమనార్హం. దీంతో ఇక కేప్ టౌన్  వేదికగా జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ ని పక్కనపెట్టి ఆలోచనలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ కోచ్ ద్రావిడ్ కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే విజేతను నిర్ణయించే మూడవ టెస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ పేలవమైన ఫామ్ జట్టుకు భారంగా మారుతుంది అని అనుకుంటున్నారట కెప్టెన్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: