నన్ను తప్పించి ఏం మెసేజ్ ఇచ్చారు.. డేవిడ్ వార్నర్ ప్రశ్న?

praveen
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ను గుర్తు చేయగానే అందరికీ గుర్తొచ్చేది డేవిడ్ వార్నర్. అంతలా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయి పోయాడు ఈ ఆస్ట్రేలియా క్రికెటర్. ఐపీఎల్లో పసికూనగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తనదైన కెప్టెన్సీ తో ఒకసారి టైటిల్ విజేతగా నిలిపిన డేవిడ్ వార్నర్ కు ఆ తర్వాత మాత్రం జట్టులో ఎంతటి అవమానం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా జట్టుకు కెప్టెన్గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ కేన్ విలియమ్సన్ ను కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది జట్టు యాజమాన్యం.

 ఇక ఆ తర్వాత ఏకంగా స్టార్ క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ ను పూర్తిగా జట్టులో నుంచి తప్పించింది. ఆ తర్వాత కనీసం మైదానంలోకి కూడా రావడానికి అనుమతి ఇవ్వకుండా హోటల్ గదికి పరిమితం చేసింది. ఇలా డేవిడ్ వార్నర్ విషయంలో సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వ్యవహరించిన తీరు మాత్రం అభిమానులను ఎంతగానో నిరాశకు గురి చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. అదే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇటీవలే డేవిడ్ వార్నర్ ను రిటైన్ చేసుకోకుండా వేలంలో కి వదిలేసింది. దీంతో మళ్లీ డేవిడ్ వార్నర్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.


 ఇకపోతే  సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం వార్నర్ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఇప్పటికే పలుమార్లు బాధ బయటపెట్టాడు డేవిడ్ వార్నర్. ఇక ఇటీవల మరోసారి ఇదే విషయంపై స్పందిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం పై ప్రశ్నల వర్షం కురిపించాడు. జుట్టు కోసం ఎంతో చేసిన ఒక కెప్టెన్ను తప్పించి ఆ తర్వాత మ్యాచ్లోనూ ఆడించక పోతే జట్టులో ఉన్న యువ ఆటగాళ్లకు ఏమి సందేశం ఇచ్చినట్లు అంటూ సన్రైజర్స్ యాజమాన్యాన్ని ప్రశ్నించాడు డేవిడ్ వార్నర్.. ఇలాంటివి నాకు కూడా జరగవచ్చు అని ఆటగాళ్లు  కూడా అనుకుంటూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు.. ఏమైనా ప్రతిదాన్ని ఆమోదించాల్సిందే.. ఒకవేళ చర్చించాలి అంటే నేరుగా నాతోనే మాట్లాడాల్సింది.. నేనేమి వాళ్లను కొరకే వాణ్ణి కాదు... నన్ను ఎందుకు తీసుకోవడం లేదు అని అర్థం చేసుకునే వాడిని.. నా నిష్క్రమణ అభిమానులకు బాధ కలిగిస్తోందని విషయం నాకు తెలుసు.. కానీ కెప్టెన్సీ తొలగించడం ఎంతగానో బాధ కలిగించింది అని చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: