వార్నీ.. బట్టతలపై ఆటోగ్రాఫ్ చేశాడు?
ఇక ఇలా సెలబ్రిటీల, క్రికెటర్ల నుంచి నుంచి అభిమానులు ఆటోగ్రాఫ్ లో ఫోటోగ్రాఫర్లు తీసుకోవడం సర్వసాధారణం. ఇక ఇలా సినీ సెలబ్రిటీలు క్రికెటర్లు ఎక్కడ కనిపించినా అభిమానులు చుట్టూ చేరి సెల్ఫీలు అడుగుతూ ఉంటారు. కొంతమంది కాస్త విచిత్రంగా ఆటోగ్రాఫ్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక అభిమాని ఇలాంటిదే చేసి ప్రస్తుతం వార్తల్లోకి ఎక్కాడు. ఇప్పుడు వరకు టోపీలు, జెర్సీలు,,నోట్బుక్ పైన ఆటోగ్రాఫ్ లు చేయడం చూశాము. కానీ ఇక్కడ మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ జరగనిది చూస్తారు అని చెప్పాలి. ఎందుకంటే ఒక అభిమాని బట్టతలపై సంతకం చేశాడు క్రికెటర్. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ మైదానంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా ఇంగ్లండ్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా జనవరి 5వ తేదీన నాలుగవ టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక మ్యాచ్ జరుగుతున్న సమయంలో వీక్షించేందుకు వచ్చిన అభిమానులు బౌండరీ లైన్ దగ్గరకు వెళ్లి ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ ను ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ కోరారు. దీంతో వెంటనే ఆ క్రికెటర్ అభిమానుల కోరికను కాదనలేక ఒక అభిమాని దగ్గరకు వెళ్ళాడు. అతడి బట్టతలపై ఆటోగ్రాఫ్ చేశాడు. దీంతో గ్యాలరీ లో ఉన్న అభిమానులు అందరూ ఆశ్చర్యపోయి చప్పట్లతో హర్షధ్వానాలు పలికారు.. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.