ప్చ్.. అనుకున్నదే జరిగింది.. టెస్ట్ లకు కొత్త కెప్టెన్?
అయితే రెండవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా అద్భుతంగా రాణిస్తూ ఉంది అనుకుంటున్న సమయంలో అటు భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. కోహ్లీసేన ఎంతో బలంగా కనిపిస్తుంది అనుకుంటున్న సమయంలో ఏకంగా కెప్టెన్ కోహ్లీ రెండో టెస్టుకు దూరం కావడం టీమిండియాకు ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. అయితే ఇప్పటికే గాయం కారణంగా రోహిత్ శర్మ లాంటి కీలకమైన బ్యాట్స్మెన్ టెస్టు జట్టుకు దూరమయ్యాడు. ఇక ఇప్పుడు కెప్టెన్ గా కొనసాగుతున్న కోహ్లీ కూడా ఒకవేళ గాయం బారిన పడితే మాత్రం టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుంది అని ఎంతో మంది ప్రేక్షకులు భావించారు. అలా జరగకూడదు అని కోరుకున్నారు. కానీ చివరికి అందరూ భయపడినట్లు గానే జరిగింది.
సౌత్ ఆఫ్రికా తో రెండో టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా ఆ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే చేసేదేమీ లేక జోహన్నెస్బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ కి వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది బీసీసీఐ. ఈ క్రమంలోనే కోహ్లీ స్థానంలో కె.ఎల్.రాహుల్ జట్టును ముందుకు నడిపించ పోతున్నాడు. ఇకపోతే ఇటీవల జోహన్నెస్బర్గ్ వేదికగా జరగబోయే మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వెన్నునొప్పి కారణంగా విరాట్ కోహ్లీ దూరం కావడంతో అతని స్థానంలో జట్టులోకి హనుమ విహారి ఎంట్రీ ఇచ్చాడు. ఇక కోహ్లీ లేకుండా టీమిండియా రెండో టెస్టు మ్యాచ్ లో ఎలా రాణించ బోతుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.