ఐపీఎల్ వల్లే.. భారత బౌలర్లు ఇలా తయారయ్యారు?
సెంచూరియన్ మైదానంలో ఎప్పుడు అద్భుతంగా రాణిస్తూ ఉంటుంది సౌత్ ఆఫ్రికా జట్టు. అలాంటిది సెంచరియన్ వేదికగా భారత జట్టు సౌత్ ఆఫ్రికా జట్టును ఓడించడం అంటే చరిత్ర సృష్టించడమే అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా భారత బౌలింగ్ విభాగం అయితే అద్భుతంగా రాణించింది అని చెప్పాలి. ఎక్కడ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లకు అవకాశం ఇవ్వకుండా తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో విజయం సాధించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ విభాగం పై మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఆశిష్ నెహ్రా టీమ్ ఇండియా బౌలింగ్ విభాగంపై ప్రశంసల వర్షం కురిపించారు.
టీమిండియా పేసర్లు రాటు తేలడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడటం కారణం అంటూ ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భారత పెసర్లు జట్టులో కీలకంగా వ్యవహరిస్తూ టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవలే సౌతాఫ్రికాతో సెంచరియన్ వేదికగా జరిగిన మొదటి భారత పేసర్లు ఏకంగా 18 వికెట్లు పడగొట్టడం గమనార్హం. షమి 8, జస్ప్రిత్ బూమ్రా 5, సిరాజ్ 3, షార్దుల్ రెండు వికెట్లు పడగొట్టారు. ఐపీఎల్ భారత క్రికెట్ ను పూర్తిగా మార్చేసింది అంటూ చెప్పుకొచ్చాడు ఆశిష్ నెహ్రా. సీనియర్ లతోపాటు జూనియర్లు కూడా రాటుదేలటంతో భారత ఫేస్ దళం మరింత పటిష్టంగా మారిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు.